ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కూడా ఎన్నారైలు చాలా వరకు ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నారై లు ఉద్యోగాలు కోల్పోవడం కరోనా కారణంగా ఆర్ధిక కష్టాలు ఎదుర్కోవడం వంటివి గత నాలుగు నెలలుగా చూస్తూనే ఉన్నాం. ప్రభుత్వాలు కూడా ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాయి. ఈ నేపధ్యంలో ఎన్నారైల కోసం కేంద్రం త్వరలోనే ఒక కార్యక్రమం మొదలు పెట్టే ఆలోచనలో ఉంది అని తెలుస్తుంది. ఎన్నారైలు పెట్టుబడులు పెట్టే విధంగా పరిస్థితులు సృష్టించాలి అని భావిస్తుంది.

ఎన్నారైలు భారత్ లో పెట్టుబడులు పెడితే పూర్తి స్థాయిలో ప్రోత్సాహం అందించడానికి గానూ ఒక ప్రణాళిక సిద్దం చేయాలని కేంద్ర  పరిశ్రమల శాఖ భావిస్తుంది. ఇతర దేశాల్లో స్థిరపడి తిరిగి భారత్ కు రావాలి ఇక్కడ కంపెనీలు స్థాపించాలి అని ఎవరు అయితే అనుకుంటారో వారికి పూర్తిగా ప్రోత్సాహకాలు అందించడానికి  ఒక ప్లాన్ ని విడుదల చేయనుంది కేంద్రం. కోటి రూపాయల నుంచి పది కోట్ల వరకు పెట్టుబడి పెట్టే వారికి కొత్త స్కీం అందుబాటులోకి వస్తుంది. స్థానికంగా ఉన్న ప్రభుత్వాలు కూడా దీనికి సహకరించే విధంగా కేంద్రం ఒక ప్లాన్ విడుదల చేస్తుంది.

ఆత్మ నిర్భర్ భారత్ అనే కార్యక్రమానికి కేంద్రం పిలుపునిచ్చింది. అలాగే  ఎన్నారై ల కోసం కూడా ఒక పిలుపుని ఇచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. వేలాది మంది ఎన్నారై లు ఇప్పుడు పెట్టుబడులు పెట్టడానికి సిద్దంగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం త్వరలో కేబినేట్ తో చర్చించి కొత్త ప్లాన్ ని అమలులోకి తీసుకొస్తుంది. ముఖ్యంగా అమెరికా సహా పలు దేశాల్లో ఎన్నారైలు చాలా ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ఇతర దేశాల నుంచి చాలా మంది వందే భారత్ మెషిన్ అనే కార్యక్రమం ద్వారా తిరిగి మన దేశానికి వచ్చేశారు. త్వరలోనే మరి కొంత మంది రావడానికి సిద్దంగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: