అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు , ఆయన భార్యకు కరోనా వైరస్ సోకడం పై అమెరికా ప్రత్యర్థి దేశాలు సంబరాలు చేసుకుంటున్నాయి. వెటకారపు కామెంట్లు చేస్తూ ఆట పట్టించే ప్రయత్నం చేస్తున్నాయి. ముఖ్యంగా చైనా ఈ విషయంలో చాలా సంతోషంగా ఉన్నట్టు కనిపిస్తోంది. దీనికి కారణం ప్రపంచదేశాలని సంక్షోభంలోకి నెట్టడానికి ప్రధాన కారణం చైనానే అంటూ మొదటి నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శిస్తూనే వస్తున్నారు. అక్కడితో ఆగకుండా కరోనా వైరస్ ను చైనా వైరస్ అంటూ ట్రంప్ అనేక సందర్భాల్లో వెటకారం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చైనా గుర్తు చేస్తోంది. చైనానే కాదు, జపాన్ కూడా ఇదే బాటలో పయనిస్తూ ఎగతాళి చేస్తోంది.


కరోనాకు తామే కారణమని పదే పదే విమర్శలు చేసిన అమెరికాపై చైనీయులు  కామెంట్లతో విరుచుకుపడుతూ, వెటకారపు వీడియోలతో ఆట పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే చైనా అధికారిక మీడియా కూడా ట్రంప్ దంపతులకు కరోనా పాజిటివ్ వచ్చినట్టుగా ప్రచారం చేసింది. ఈ మేరకు చైనా వార్తాపత్రిక గ్లోబల్ టైమ్స్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ కథనాలను ప్రచురించింది. కరోనా, వైరస్ ప్రభావంతో అల్లాడుతున్న చైనాపై సానుభూతి చూపించడం మానేసి, విమర్శలు చేసి వెటకారం  చేశారని, ఇప్పుడు దానికి తగిన మూల్యం చెల్లించుకున్నారు అంటూ వెటకారపు కథనాలను ప్రచురించింది.


అయితే చైనా ప్రభుత్వం మాత్రం ట్రంప్ కి కరోనా సోకిన విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు.ఇదిలా ఉంటే ట్రంప్ గతంలోనే కరోనా వైరస్ ప్రభావాన్ని ముందుగా అంచనా వేయడంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ విఫలం అయ్యిందని, దాని ప్రభావాన్ని తగ్గించే విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ పని తీరు ఏమాత్రం బాగోలేదు అంటూ విమర్శలు చేశారు. ఇప్పుడు ట్రంప్ దంపతులిద్దరూ ఎన్నికల సమయంలో ఈ విధంగా వైరస్ ప్రభావానికి గురవడంతో ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉంటాయో అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఇక ప్రపంచ స్టాక్ మార్కెట్లు అన్నీ, ట్రంప్ కి కరోనా అనే వార్తలతో డీలా పడ్డాయి. ఇదిలా ఉంటే అమెరికా మిత్ర దేశాలు మాత్రం ట్రంప్ పై సానుభూతి వ్యక్తం చేశాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: