అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ విజయం సాధించడానికి చాలా తీవ్రంగా కష్టపడుతున్నా సరే ఆయనకు మాత్రం ఆశించిన విధంగా పరిస్థితి కనపడటం లేదు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. రాజకీయంగా ఇప్పుడు అమెరికాలో ట్రంప్ ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయితే ఆయన ఇప్పుడు భారతీయుల ఓట్ల కోసమే తీవ్ర స్థాయిలో కష్టపడుతున్నారు. ముఖ్యంగా భారతీయులు చాలా మంది ట్రంప్ వైఖరిపై చాలా సీరియస్ గా ఉన్నారు. అయితే ఇప్పుడు తన మంత్రులను పంపించడం ద్వారా ఆయన భారతీయులను తన వైపుకి తిప్పుకునే విధంగ ప్రయత్నాలు చేస్తున్నారు.

అంతే కాకుండా త్వరలోనే భారతీయులను ఆకట్టుకునే విధంగా ట్రంప్ నుంచి ఒక ప్రకటన కూడా వచ్చే అవకాశాలు ఉండవచ్చు అని అందరూ భావిస్తున్నారు. మరి ఆయన నుంచి ఏ విధమైన ప్రకటన వస్తుంది ఏంటీ అనేది చూడాలి. ముఖ్యంగా అమెరికాలో ఉన్న ఇండియన్ ఉద్యోగులకు వ్యాపారులకు ఆయన ప్రత్యేక ప్యాకేజి ప్రకటించే అవకాశం ఉండవచ్చు అని తాను గెలిస్తే ఏం చేస్తానో వారికి బలంగా చెప్పే అవకాశాలు ఉండవచ్చు అని భావిస్తున్నారు. మరి ఇది ఎంత వరకు ఫలిస్తుంది ఏంటీ అనేది చూడాలి.

ఇక  విద్యార్ధుల కోసం కూడా ఆయన ఒక ప్రత్యేక  ప్లానింగ్ ప్రకటించే అవకాశం ఉండవచ్చు అని కూడా భావిస్తున్నారు.  మన దేశానికి చెందిన వారి ఓటు బ్యాంకు గెలుపు ఓటములను ప్రభావితం చేస్తుంది కాబట్టి ట్రంప్ చాలా కష్టపడుతున్నారు. మరి ఏ విధంగా ఆయనకు ఇవి అన్నీ అనుకూలంగా మారే అవకాశం ఉందో చూడాలి. అయితే ట్రంప్ గెలిస్తే హెచ్ 1 బీ వీసాల విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా వ్యవహరించే అవకాశం ఉండవచ్చు అని భావిస్తున్నారు. అదే ఇప్పుడు అక్కడి  ఎన్నారైలను కాస్త ఎక్కువగా కంగారు పెట్టే అంశంగా చెప్పుకోవాలి. మరి ట్రంప్ గెలుస్తారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: