జార్జియాలో తన మద్దతు దారులతో భారీ ర్యాలీ నిర్వహించిన ట్రంప్ వైట్ హౌస్ లో తాను ఉండగా మరొకరు అడుగు పెట్టేది లేదని తేల్చి చెప్పేశారు. అధ్యక్ష్య పీటం తనదేనని తన మద్దతు దారులను ఉద్దేశించి ప్రసంగించారు. ఎన్నికల్లో మోసం జరిగిందని మరో సారి ఆరోపణలు గుప్పించారు. ఎన్నికల ఫలితాల విషయంలో రిపబ్లికన్ చట్టసభ్యులు సైలెంట్ గా ఉండాలని ట్రంప్ సూచించారు. భారీగా తరలి వచ్చిన మద్దతు దారులను చూసి మైమరచిపోయారో ఏమో కాని సినిమాటిక్ డైలాగులు పలికారు ట్రంప్. అధ్యక్ష పీటం మనదే నేను మీకు హామీ ఇస్తున్నాని అన్నారు.
ఇదిలాఉంటే ట్రంప్ ఈ ర్యాలీలో చేసిన కొన్ని వ్యాఖ్యలు అందరిలో ఉత్ఖంట రేకెత్తిస్తున్నాయి. అధికారం మనందే ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదు. వైట్ హౌస్ లోకి ఎవరిని రానిచ్చేది లేదంటూ వ్యాఖ్యానించడంతో జనవరి 20 వస్తోందంటేనే వైట్ హౌస్ అధికారులలో గుబులు మొదలయ్యింది. ఒక వేళ ట్రంప్ కు అన్ని దారులు మూసుకుపోయి వైట్ హౌస్ వీడే పరిస్థితి గనుకా వస్తే ట్రంప్ రియాక్షన్ ఎలా ఉండబోతోందనే టెన్షన్ వాతావరం నెలకొంది.