
ఇక ఇదిలా ఉంటే ఈ వైరస్ పై అనేక పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉంది అనే భావన కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. దీన్ని కట్టడి చేయాలి అంటే కొత్త విధానాలు చాలా అవసరమని లేకపోతే ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రతి ఏడాది కరోనా కారణంగా నష్టపోయే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. ప్రజలు కూడా ప్రాణాలు కోల్పోతున్నారని కాబట్టి ఈ విషయంలో కాస్త ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని కొంతమంది అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ విషయంలో అమెరికా ముందడుగు కూడా వేసిందని సమాచారం.
భారత్ సహా కొన్ని దేశాల్లో అమెరికా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయడానికి సిద్ధం అవుతున్నారని తెలుస్తోంది. అసలు కరోనా వైరస్ ఎన్ని రకాలుగా ఉంది ఏంటి అనే దానిపై ఇప్పుడు కొన్ని దేశాల్లో పరిశోధనలు చేయడానికి అమెరికా శాస్త్రవేత్తలు భారత్ సహా కొన్ని దేశాల్లో అడుగుపెట్టనున్నారు. ఇది పదే పదే తన ప్రభావం చూపించడానికి ప్రధాన కారణం ఏంటి అనే దానిపై కూడా అమెరికా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసే అవకాశాలు కనబడుతున్నాయి. వచ్చే నెల నుంచి ఈ పరిశోధనలు మొదలయ్యే అవకాశాలు కనపడుతున్నాయి.