అమెరికా దేశంలోని
కాలిఫోర్నియా రాష్ట్రంలో ఒక ఆగంతుకుడు తుపాకి పట్టుకొని కాల్పులు జరుపుతూ మారణహోమం సృష్టించాడు. ఈ ఉన్మాది జరిపిన కాల్పుల్లో మొత్తం 9 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో భారత సంతతికి చెందిన ఒక వ్యక్తి కూడా ఉన్నారు. కాల్పులు జరుగుతున్న సమయంలో భారతీయుడు తన పక్కనే ఉన్న సహచరులను కాపాడేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ఆ ఉన్మాది భారతీయుడిని సైతం తుపాకీతో కాల్చేసాడు. అయితే తన ప్రాణాలు పణంగా పెట్టి తన సహచరుల ప్రాణాలను కాపాడేందుకు ధైర్యం చేసి ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి తప్‌తేజ్‌దీప్ సింగ్ (36) అని
స్థానిక పోలీసులు నిర్ధారించారు.
పూర్తి వివరాలు తెలుసుకుంటే.. ఉత్తర
కాలిఫోర్నియా శాన్ జోస్ లోని ఓ రైల్ యార్డులో పనిచేస్తున్న 57 ఏళ్ల సామ్యూల్ క్యాసిడై తన సహోద్యోగుల పై కాల్పులకు తెగబడ్డాడు. సామ్యూల్ తాను వర్క్ చేస్తున్న ప్రదేశంలో కాల్పులకు పాల్పడతానని పదేళ్ల క్రితమే చెప్పినట్టు అతడి
భార్య వెల్లడించింది. అయితే ఈ అగంతకుడు పాల్పడిన ఘటన తో ఒక్కసారిగా ఉలిక్కి పడిన అక్కడి ఉద్యోగులు తీవ్ర భయాందోళనలకు గురై ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీశారు. ఐతే రైల్ యార్డ్ లో ఆపరేటర్ గా విధులు నిర్వర్తిస్తున్న ఎన్ఆర్ఐ తప్‌తేజ్‌దీప్ సింగ్ (36) అగంతకుడి కాల్పుల నుంచి తప్పించుకునేందుకు క్యాబిన్ లోకి వచ్చి తలదాచుకున్నారు. అయితే పరిస్థితి మరింత భయానకంగా మారటంతో తన సహోద్యోగుల ను కాపాడేందుకు తప్‌తేజ్‌దీప్ క్యాబిన్ బయటికి వచ్చారు. ఈ క్రమంలోనే ఆయన సామ్యూల్ కాల్పులకు బలయ్యారు.
మృతుడు సింగ్ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ, సైట్ నుండి తప్పించుకున్న సహోద్యోగులు, ఇతరులను కాపాడేందుకు సింగ్ ఒక కార్యాలయంలో దాచిపెట్టినట్లు చెప్పారు. తప్‌తేజ్‌దీప్ యార్డులోని అన్ని ప్రదేశాలకు తిరుగుతూ అందరూ జాగ్రత్తగా ఉండండి.. దాచుకోండి అంటూ అప్రమత్తం చేశారని ఆయన మామ సఖ్వంత్ ధిల్లాన్ ఓ వార్తాపత్రికకి వెల్లడించారు. తప్‌తేజ్‌దీప్ సింగ్ కి
పెళ్లి కాగా ఆయనకు ఇద్దరు పిల్లలను ఉన్నారు. వారిలో ఒకరికి ఒక సంవత్సరం కాగా మరొకరికి మూడేళ్లు.