భారతీయులు ధైర్యవంతులు, తెలివైన వారు మాత్రమే కాదు తమ తెలివిని పరుల బాగోగుల కోసం ఉపయోగించే దయా హృదయులు. ఎన్నో సంవత్సరాలుగా భారతీయులు ఇతర దేశస్థులకు  సహాయం చేస్తూ వారి హృదయాలలో చిరస్థాయిగా నిలిచి పోతున్నారు. అయితే అలాంటి భారతీయులలో జస్టిస్ రాధాబినోద్ పాల్ ఒకరిగా నిలుస్తున్నారు. జపనీయులు ఈ లాయర్ ప్రతిమలను దేవాలయాలలో స్థాపించి దేవుడిగా ఆరాధిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. అయితే ఒక భారతీయుడు జపనీయుల మనసుల్లో అంతటి స్థానం ఎలా సంపాదించుకున్నారో వివరంగా తెలుసుకుంటే.. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ప్రపంచంలోని అన్ని దేశాలు కలిసి జపాన్ దేశాన్ని అపరాధిగా బోనులో నిల్చోబెట్టాయి.

ఆ సమయంలో ప్రతి ఒక్కరూ జపాన్ దేశం పై నిందలు వేశారు. ఆసియా-పసిఫిక్ దేశాలపై జపాన్ దండయాత్ర చేసి అనేక ఘోరాలకు పాల్పడిందని ఆరోపణలు చేశారు. రెండవ ప్రపంచ యుద్ధంలో ఇటలీ, జర్మనీ దేశాలతో జపాన్ అత్యంత క్రూరంగా వ్యవహరించిందని కూడా విమర్శలు చేశారు. అయితే జపాన్ కి జర్మనీ, ఇటలీ దేశాలు భాగస్వామ్య పక్షాలు కాగా ఈ దేశాలు రెండో ప్రపంచ యుద్ధంలో ఓటమిని చవి చూశాయి. అయితే తమ ఓటమికి కారణం జపాన్ దేశమే కారణమని మిత్ర పక్ష కూటమి దేశాలు భావించి దాన్ని శిక్షించాలని నిర్ణయించాయి. ఇందులోని భాగంగానే జపాన్ ప్రధాని, పాలకులు, సైన్యాధికారులు ఇలా చెప్పుకుంటూ పోతే వేలాది జపనీయులపై హత్యలు, ఆక్రమణలు, తదితర కేసులు నమోదు చేశారు. ఐతే జపనీయులపై నమోదైన కేసును విచారించేందుకు టోక్యో విచారణ ధర్మాసనం ఏర్పాటు అయింది.

ఐతే 11 దేశాల న్యాయమూర్తులతో ఏర్పాటైన ఈ ధర్మాసనంలో ఇండియన్ జస్టిస్ రాధాబినోద్ పాల్ కూడా ఉన్నారు. ఐతే కేసులపై విచారణ జరిపిన అనంతరం ఈ ధర్మాసనం జపనీయులకు మరణశిక్షలు, యావజ్జీవ కారాగార శిక్షలు విధించింది. ఐతే ధర్మాసనం ఇచ్చిన తీర్పుతో రాధాబినోద్ పాల్ విబేధించారు. నిందితులకు శిక్షలు విధించటం ఎంతవరకు సమంజసం? అని ఆయన ఒక్కరే బెంచ్ తీర్పుకి తీవ్ర విముఖత చూపారు. రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ క్రూరంగా వ్యవహరించిందని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని ఆయన వ్యాఖ్యానించారు. యుద్ధ నేరాలకు పాల్పడటం జపాన్ ప్రభుత్వ విధానం కాదని రాధాబినోద్ పాల్ బలంగా వాదించారు.

శత్రు దేశాలు రెచ్చగొట్టడం వల్లే జపాన్ యుద్ధంలోకి దిగాల్సిన పరిస్థితి వచ్చిందని.. ఈ విషయాన్ని శత్రు దేశాలు కూడా తేల్చాయని.. దీన్నిబట్టి ఈ నేరంలో శత్రు దేశాల హస్తం ఉందని స్పష్టమవుతుందని ఆయన చెప్పుకొచ్చారు. తప్పనిసరి పరిస్థితులలో యుద్ధం చేయడం అసలు తప్పే కాదని.. యుద్ధం తర్వాత చట్టాలు చేసి శిక్షలు విధించడం అన్యాయమని.. నిందితులంతా నిర్ధోషులు అని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఐతే జపాన్ దేశానికి మద్దతుగా రాధాబినోద్ పాల్ చేసిన వాదనలు టోక్యో ట్రయల్స్ ధర్మాసనం లో నెగ్గలేదు. దీనితో ధర్మాసనంలోని ఇతర న్యాయమూర్తుల అభిప్రాయమే తుది తీర్పు అయ్యింది. అయితే రాధాబినోద్ పాల్ తమ దేశానికి మద్దతుగా మాట్లాడటంతో జపనీయులు హర్షం వ్యక్తం చేశారు. ఇక ఆ తరువాత కూడా ఆయన పలుమార్లు జపాన్‌లో పర్యటించి ఆ దేశం పట్ల తన ప్రేమను చాటుకున్నారు. ఒకానొక సందర్భంలో ఆయన మాట్లాడుతూ.. ఫారిన్ దేశాలకు వ్యతిరేకంగా నిలబడ్డ ఏకైక ఆసియా దేశం జపాన్ దేశమేనని ప్రశంసల వర్షం కురిపించారు. దీనితో రాధాబినోద్ జపనీయుల మనసులు గెలుచుకున్నారు. అప్పటినుంచి జపాన్ ప్రజలు ఆయన ప్రతిమలు పెట్టి పూజిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: