ఇండియా లో అభివృద్ధి చేసిన కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలు తీసుకున్న భారతీయ ప్రయాణికులను తమ దేశంలోకి అనుమతిస్తామని ఇటీవల జర్మనీ దేశం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా అత్యంత ప్రమాదకరమైన వైరస్ వేరియంట్ కేసులు ఉన్న దేశాల జాబితా నుంచి భారతదేశాన్ని తీసేస్తున్నామని జర్మనీ దేశం వెల్లడించింది. జర్మనీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బుధవారం నుంచి అనగా జులై 7వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని జాతీయ అంటువ్యాధుల ప్రెవేన్షన్ సెంటర్ రాబర్ట్ కూచ్ ఇన్స్టిట్యూట్ వెల్లడించింది.
నేపాల్, రష్యా, పోర్చుగల్, బ్రిటన్, భారత్ దేశాలలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రతను పరిగణలోకి తీసుకొని రెండో కేటగిరీలోకి చేర్చుతున్నామని జర్మనీ విస్పష్టం చేసింది. రెండవ జాబితాలో ఉన్న దేశాల ప్రయాణికులు 2 కరోనా టీకా డోసులు తీసుకుంటే క్వారంటైన్ లో ఉండాల్సిన అవసరం లేదని జర్మనీ దేశం వెల్లడించింది. ఒకటి టీకా డోసు తీసుకున్న వారు లేదా అసలు టీకా తీసుకొనివారు జర్మనీ దేశంలోకి ప్రవేశించిన తర్వాత 10 రోజులు పాటు తప్పకుండా క్వారంటైన్లో ఉండాలని ఆ దేశ అధికారులు వెల్లడించారు. క్వారంటైన్ లో ఉన్న 5 రోజుల తర్వాత ఆర్‌టీపీసీఆర్ టెస్టు నిర్వహిస్తారు. ఈ పరీక్షలో నెగటివ్ వస్తే.. క్వారంటైన్ నుంచి బయటకు వెళ్ళిపోవచ్చు.