ఇండియన్ ఆరిజిన్ పీపుల్ కి గ్లోబల్ ఆర్గనైజేషన్ కో-ఆర్డినేటర్ గా వ్యవహరిస్తున్న రీటా అబ్రహం దక్షిణాఫ్రికాలోని భారతీయుల పరిస్థితిని వివరించారు. ప్రజాస్వామ్యం పై దాడి చేయడానికి దక్షిణాఫ్రికా ప్రజలు ముందస్తుగానే పక్కా ప్లాన్ రూపొందించారని ఆమె అన్నారు. పేదరికం, ఆకలి, ఆర్థిక పరిస్థితులు కూడా ఈ దాడులకు దారి తీసి ఉండొచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. ఆకలితో బాధపడే వారు దోపిడీలకు పాల్పడుతున్నారని ఆమె చెప్పుకొచ్చారు. దోపిడీల కారణంగా చాలా మంది అమాయక ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బును కోల్పోతున్నారని ఆమె బాధను వ్యక్తం చేశారు.
అయితే దక్షిణాఫ్రికాలో నివసిస్తున్న భారతీయుల కోసం భారత ప్రభుత్వం అధికారికంగా ఎటువంటి చర్యలు చేపట్ట లేదని ఆమె అన్నారు. ఏ భారతీయ అధికారి కూడా తమను ఆశ్రయించ లేదని ఆమె తెలిపారు. అయితే, భారత సంతతికి చెందిన వ్యక్తులకు ప్రాతినిధ్యం వహిస్తున్న గ్లోబల్ ఆర్గనైజేషన్ 'ఇండియన్ డయాస్పోరా కౌన్సిల్' స్పందించింది. ఈ కౌన్సిల్ భారతీయ సంతతికి చెందిన ప్రజల సమస్యలను తెలియజేయడానికి దక్షిణాఫ్రికాలోని అనేక గ్రూపులతో చర్చలు ప్రారంభించింది.
ఇకపోతే కొద్ది రోజుల క్రితం స్టార్ట్ అయిన దాడుల కారణంగా చాలామంది ఆఫ్రికన్ ప్రజలు చనిపోయారు. ఒకేరోజు 26 మంది ప్రజలు చనిపోయారు.