ఎన్నో కారణాలతో అమెరికాకు వెళ్లాలని భారతీయులు అనుకుంటూ ఉంటారు. అది చదువు కోసం కావొచ్చు, లేదా ఏదైనా వైద్యము కోసం కావొచ్చు, అక్కడే స్థిరపడడం కోసం ఉద్యోగం కోసం అయినా కావొచ్చు. అయితే మన దేశం నుండి ఇతర దేశంలోకి వెళ్లి అక్కడ స్థిరపడడానికి కొన్ని నియమాలు ఉంటాయి. అదే విధంగా ఇతర దేశాల నుండి మన దేశంలో సభ్యత్వం పొందడానికి ఏమి చేయాలి అనేది ఒకసారి చూద్దాం. కరోనా వైరస్ మహమ్మారి రావడం వలన విదేశీ ప్రజలు చాలా మంది భారత్ లోనే ఉన్నారు. దాదాపుగా రెండు మూడు సంవత్సరాల నుండి ఇక్కడే ఉంటున్నారు. అయితే ఇలాంటి వారికి ఇండియన్ సిటిజన్ అయ్యే అవకాశం ఉందా.

ఇండియా సభ్యత్వం కోసం కేంద్ర ప్రభుత్వం తెలిపిన కొన్ని నియమాలను అనుసరించి అప్లై చేసుకోవాలి.  ఎవరైతే ఇండియాలో స్థిరపడాలని అనుకుంటున్నారో వారు అప్లై చేయడానికి ముందు వరకు కనీసం ఏడు సంవత్సరాలు ఇక్కడే నివాసాన్ని పొంది ఉండాలి. ఇదే నియమం భారతీయ వ్యక్తిని పెళ్లి చేసుకున్న విదేశీ పౌరుడికి సైతం వర్తిస్తుంది.  ఒక వేళ పిల్లలు కనుక భారతీయ పౌరులుగా సభ్యత్వాన్ని పొందాలంటే వారి తల్లితండ్రులు భారతీయులే ఉండాలి. మరియు వారు ఖచ్చితంగా ఏడు సంవత్సరాలు నివసించి ఉండాలి. అంతే కాకుండా ఈ విధంగా అప్లికేషన్ వేసిన తర్వాత 12 నెలలు ఇండియాలోనే ఉండాలి.

 ఒక వేళ మీరు ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో మీ సొంత దేశానికి వెళ్లాల్సి వస్తే కేంద్ర ప్రభుత్వం 30 రోజుల నిబంధనలతో కూడిన అనుమతిని ఇస్తుంది. ముందుగా వారి దేశంలో ఉన్న పౌరసత్వాన్ని రద్దు చేసుకోవాలి.  అప్లికేషన్ సమయంలో ఈ రిపోర్ట్ ను కూడా జతపరచవలసి ఉంటుంది.  అయితే మీ దేశంలో ఉన్న పౌరసత్వం రద్దు కావడానికి కొంచెం సమయం పట్టే అవకాశం ఉంది. ఇది పూర్తిగా ఆ దేశ పనితీరు మరియు విధానాలపై ఆధారపడి ఉంటుంది.  ఒకసారి ఈ పత్రం మీకు వచ్చిన తర్వాతనే భారతీయ పౌరసత్వాన్ని సంబందించిన అప్లికేషన్ ఇస్తారు.  కానీ పిల్లల విషయంలో నిబంధనలు వేరుగా ఉన్నాయి. ఒక బిడ్డ జన్మించిన రోజు నుండి 18 సంవత్సరాల వరకు తల్లితండ్రుల పౌరసత్వం వారికి ఉంటుంది. కానీ 18 సంవత్సరాల తర్వాత ఏ దేశంలో జీవించాలి అన్నది పూర్తిగా వారిష్టం.

మరింత సమాచారం తెలుసుకోండి: