ఈ విషయం పట్ల పలువురు ఆనందాన్ని వ్యక్త పరుస్తున్నారు. సిలికానాంధ్ర యూనివర్సిటీ ప్రెసిడెంట్ కూచిబొట్ల ఆనంద్ మాట్లాడుతూ ఇప్పటికే అత్యున్నత విద్యా ప్రమాణాలకు ఈ యూనివర్సిటీ ప్రసిద్ది చెందింది. ఇప్పుడు నిర్మించబోతున్న విద్యా ప్రాంగణం ద్వారా కేవలం ఇక్కడ ఉండే ప్రజలకే కాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు అత్యున్నత విద్యను అందిస్తుందని తెలిపారు. ఈ యూనివర్సిటీని నిర్మించడానికి ఆరు నుండి ఎనిమిది సంవత్సరాల వరకు పట్టవచ్చని తెలుస్తోంది. కానీ మేజర్ పార్ట్ ను అయిదేళ్లలో పూర్తి చేయడానికి మా వంతు కృషి చేస్తామని ఆనంద్ తెలిపారు.
అయితే ఈ విశ్వవిద్యాలయం నిర్మాణానికి ఇప్పటి వరకు వేసిన అంచనా ప్రకారం దాదాపుగా 450 మిలియన్ డాలర్లు మన దేశ కరెన్సీలో 3,300 కోట్ల రూపాయలు అవుతుందని తెలుస్తోంది. ఈ యూనివర్సిటీ ద్వారా అన్ని రకాల విద్యా విషయాలను, కోర్స్ లను అందిస్తామని ప్రోవోస్ట్ చామర్తి రాజు చెప్పారు. ఈ ప్రాంతానికి సమీపంలో ఈ యూనివర్సిటీ రావడం పట్ల స్థానిక ప్రజలు మరియు అధికారులు సంతోషంగా ఉన్నారు. ఈ నిర్మాణం వీలైనంత త్వరలో ప్రారంభించనున్నారని తెలుస్తోంది.