ఎవరిపైనా అభిమానం ఉంటే అది ఎంత దూరమైనా వెళ్తుంది. తమకు నచ్చిన తారల అలవాట్లను, అభిరుచులను, వస్తువులను వారు కూడా ఫాలొ అవుతుంటారు. తారలు వాడే వస్తువుల నుంచి ఆటోగ్రాఫ్ చేసిన పేపర్ వరకు ఏది దొరికినా వాటిని జాగ్రత్తగా భద్రపరుస్తారు. అయితే ఇప్పటికే మనం చాలా వార్తల్లో వినే ఉంటాం.. తారల వస్తువులు, బైక్, ఇల్లు, వాచ్‌లు, షూలు అమ్మి డబ్బులు సంపాదించిన ఘటనలు చాలానే చోటు చేసుకున్నాయి. అయితే ఒక టీవీ స్టార్ తన ఆపాన వాయువు (పిత్తు)ను అమ్మి లక్షల్లో ఆదాయం సంపాదిస్తోంది. అవును ఇది నిజం. ఈ విషయాన్ని స్టెఫానీ మాట్లో అనే టీవీ స్టార్ స్వయంగా వెల్లడించింది. దీంతో ఈ విషయం తెగ వైరల్ అవుతోంది.
90డే ఫియాన్స్ అనే టీవీ షో ద్వారా స్టెఫానీ మట్లో అనే టీవీ స్టార్‌కి క్రేజ్ ఎక్కువే. సోషల్ మీడియాలో ఆమె తెగ ప్యాన్ ఫాలొయింగ్ పెంచుకుని పాపులారిటీని సంపాదించింది. అయితే ఆమె ఏం ఆలోచన పుట్టిందో తెలియదు. తన ఫ్యాన్‌కు తన అపానవాయువును అమ్మే బిజినెస్‌ను ఆమె ప్రారంభించింది. ఆ వాయువును అమ్ముతూ ఏకంగా 70 వేల డాలర్లు సంపాదించిందంట. అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారు రూ.37 లక్షలు. ఈ విషయాన్ని స్టెఫానీ స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో తెలిపింది.
స్టెఫానీ తన అపాన వాయువును ఓ గాజు పాత్రలో బంధించి.. ఒక్కో యూనిట్‌ను 1400 డాలర్లకు అమ్ముతోంది. దీనికి సంబంధించిన వీడియోలను సైతం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఇలా పిత్తును అమ్మడం ద్వారా కూడా డబ్బును సంపాదిస్తున్నట్లు ఆమె వెల్లడించింది. అయితే ఈ పిత్తు బయటకు రావడానికి తను ఎలాంటి ఆహారం తింటుందనే విషయాన్ని కూడా స్వయంగా వెల్లడించింది. ఆమె ప్రతిరోజు బీన్స్, గుడ్లు, ప్రోటీన్ మఫిన్, ప్రోటీన్ షేక్, పెరుగు తదితర ఆహార పదార్థాలు తీసుకుంటుందన్నారు. బజ్‌ఫీడ్ అనే మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఈ విషయంపై స్పష్టతను ఇచ్చారు.