ఆయుధాలు చేపట్టి అరాచక పాలన సాగిస్తూ ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ లో ఎన్నో దారుణాలకు పాల్పడుతున్నారు తాలిబన్లు. మొదట్లో మేము మారిపోయామని ప్రజల విషయంలో కఠినంగా వ్యవహరించాలీ అని అనుకోవడం లేదని ముఖ్యంగా మహిళలకు తమ ప్రభుత్వంలో సముచిత గౌరవం కనిపిస్తాము అంటూ వరుసగా స్టేట్మెంట్ ఇచ్చారు తాలిబన్లు. కానీ తాలిబన్లు మొదట్లో చెప్పిన మాటలు మొత్తం ప్రపంచ దేశాలను నమ్మించడానికి అన్నది అర్ధమవుతుంది  ఇప్పుడు అసలు రంగు బయట పెడుతున్న తాలిబన్లు ఎన్నో దారుణాలకు  పాల్పడుతూనే ఉన్నారు. ఆప్ఘనిస్థాన్లో షరియా చట్టాలు అమలులోకి తీసుకు వచ్చి చిన్నచిన్న నేరాలకు దారుణమైన శిక్షలు విధిస్తూ ప్రజలందరినీ బ్రాంతులకు గురి చేస్తున్నారు.



 ముఖ్యంగా మహిళలను అయితే బానిసలుగా చూస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. మహిళలు కనీసం చదువుకోవడానికి కూడా వీలు లేదు అంటూ తాలిబన్లు ఆంక్షలు అమలులోకి తీసుకు రావడంతో  ఆఫ్ఘనిస్థాన్లో  మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయ్. అంతే కాకుండా పురుషుడు లేకుండా మహిళలు  ఎక్కడికి వెళ్లేందుకు కూడా  అనుమతి లేదు అటు తాలిబన్లు ఇటీవల తెరమీదకు తీసుకువచ్చిన ఆంక్షలు ప్రపంచదేశాలను ఆశ్చర్యానికి గురిచేశాయి. ఇలా మహిళల పట్ల తాలిబన్లు వ్యవహరిస్తున్న తీరు రోజురోజుకీ హాట్ టాపిక్ గా మారిపోతుంది. కేవలం మహిళలకు మాత్రమే కాదు బట్టల దుకాణాల్లో ఉండే  బొమ్మలకి కూడా ప్రస్తుతం స్వేచ్ఛ లేకుండా పోయింది అని అర్థమవుతుంది.


 ఇటీవలే తాలిబన్లు మరో కొత్త రూల్ తెరమీదకు తీసుకువచ్చారు. ఆఫ్ఘనిస్తాన్ లోని బట్టల దుకాణం యజమానులకు షాక్ ఇచ్చారు తాలిబన్లు. బట్టల దుకాణాలు లోని బొమ్మల తలలను తొలగించాలంటూ ఆదేశాలు జారీ చేశారు   ఆఫ్ఘనిస్తాన్ లోని హెరాత్ ప్రావిన్స్లో ధర్మప్రచారం, వైస్ నివారణ మంత్రిత్వశాఖ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది  ఇస్లాం ప్రకారం బొమ్మలను విగ్రహాలు గా అభివర్ణిస్తూ.. అవి నిషేధించబడినవి అంటూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు తాలిబన్లు. అయితే ఇక ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న మనుషుల విషయంలోనే కాదు... ఏకంగా బట్టల దుకాణంలో ఉండే బొమ్మల విషయంలో కూడా తాలిబన్లు పెట్టిన ఆంక్షలు విడ్డూరంగా ఉన్నాయి అని అంటున్నారు విశ్లేషకులు .

మరింత సమాచారం తెలుసుకోండి: