ఇక ఆ తర్వాత ఎన్నో దేశాలు చైనా పై విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఎప్పుడూ కొత్త నాటకానికి తెర లేపుతోంది. అయితే చైనా పుట్టించిన కరోనా వైరస్ గత కొంత కాలం నుంచి చైనాలో ఇబ్బందులకు గురిచేస్తోంది. వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగి పోతుండటంతో చైనాలోని ఎన్నో ప్రాంతాల్లో ప్రస్తుతం లాక్‌డౌన్ విధించిన పరిస్థితులు ఉన్నాయి. ఇకపోతే ఇక ఇప్పుడు కరోనా వైరస్ ను కారణంగా చూపుతూ చైనా కొత్త నాటకానికి తెర లేపింది అన్నది అర్ధమవుతుంది. ఏకంగా చైనాలో డ్రాగన్ ఫ్రూట్ పై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది.. డ్రాగన్ ఫ్రూట్ కారణంగానే కరోనా వైరస్ వస్తుంది అంటూ చెప్పింది.
డ్రాగన్ ఫ్రూట్ కారణంగా కరోనా వైరస్ వస్తుందని అందుకే వియత్నాం నుంచి డ్రాగన్ ఫ్రూట్ ను దిగుమతి పై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. కానీ దీని వెనుక కారణం మాత్రం మరొకటి ఉంది అని అంటున్నారు విశ్లేషకులు. ఇటీవలే భారత్కు చెందిన బ్రహ్మోస్ క్షిపణులను కొనుగోలు చేసేందుకు వియత్నాం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ క్రమంలోనే కడుపుమంటతో చైనా వియత్నాం నుండి దిగుమతి అయ్యే డ్రాగన్ ఫ్రూట్ పై నిషేధం విధిస్తూ కొత్త నాటకానికి తెర లేపుతోంది అంటూ ప్రస్తుతం విశ్లేషకులు చెబుతున్నారు. అయితే కరోనా వైరస్ ను పుట్టించిన చైనా ఇక ఇప్పుడు ఒక ఫ్రూట్ కారణంగా వైరస్ వస్తుంది అని చెప్పడం మాత్రం ప్రపంచ దేశాలను ఆశ్చర్యానికి గురి చేస్తుంది అని చెప్పాలి.