సినిమా ప్రపంచం గురించి కొత్త విషయాలను తెలుసుకోవడానికి అందరు ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. ఈ క్రమంలోనే సినిమాల గురించి ఏదైనా విషయం సోషల్ మీడియాలోకి వచ్చింది అది క్షణాల్లో వైరల్ గా మారిపోతూ ఉంటుంది. ఎంతో మంది దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. అయితే సాధారణంగా మూవీ ప్రొడక్షన్ హౌస్ లు ఎక్కడ ఏర్పాటు చేస్తారు అన్నది దాదాపు అందరికీ ఒక అవగాహన ఉంటుంది. అన్ని రకాల సౌకర్యాలు ఉండే అనువైన ప్రదేశాలలోమూవీ ప్రొడక్షన్ స్టూడియోను ఏర్పాటు చేయడం చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం కొత్తగా ఆలోచించారు. భూమ్మీద మూవీ ప్రొడక్షన్ స్టూడియో ఏర్పాటు చేయడంలో కొత్త ఏముంది అందుకే అంతరిక్షంలో ప్రొడక్షన్ స్టూడియో ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు.


 ఇది కాస్తా ప్రస్తుతం సంచలనంగా మారిపోయింది. అంతరిక్షంలో మూవీ ప్రొడక్షన్ స్టూడియో ఏర్పాటు చేయబోతున్నట్లు బ్రిటన్కు చెందిన స్పేస్ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ సంస్థ ప్రకటించింది.. సరే ప్రొడక్షన్ స్టూడియో అంతరిక్షంలో ఏర్పాటు చేయడం వరకు ఓకే... గాని అక్కడ నుంచి పని చేయడం ఎలా అని అనుకుంటున్నారు కదా.  సిఈఈ -వన్ పేరుతో 2024 లోపు మాడ్యూల్ ను అంతరిక్షంలోకి ప్రవేశపెట్ట పోతున్నారట. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వాణిజ్య విభాగమైన ఆక్సియెమ్ స్టేషన్కు మూవీ ప్రొడక్షన్ స్టూడియోను అనుసంధానం చేయబోతున్నారట.


 ఇక ఇది గనక పూర్తయింది అంటే చాలు అటు బ్రిటన్ సరికొత్త రికార్డు సృష్టిస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకూ ఎన్నో అంతరిక్షం  నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలు చూశాము. అంతరిక్షంలో ఉండే పరిస్థితులను కళ్లకు కట్టినట్లుగా చూపించారు. అయితే అంతరిక్షంలోకి ఉన్నట్లు చూపినప్పటికీ అది కేవలం గ్రీన్ మ్యాట్ స్టూడియో లో మాత్రమే చేసి దానికి అంతరిక్షంలో ఉన్నట్లుగా గ్రాఫిక్ ఉపయోగిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మాత్రం భూమిమీద కాదు ఏకంగా అంతరిక్షంలోని షూటింగులు జరుపబోతున్నారు. భూమికి 400 కిలో మీటర్ల ఎత్తులో మైక్రో గ్రావిటీ లో షూటింగ్ చేయబోతున్నారు. ఇది ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: