భారత్ నుంచి వేరుపడిన నాటి నుంచి ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ వస్తోంది పాకిస్తాన్. ఇక  ఉగ్రవాదులతో ఇతర దేశాలలో మారణహోమం సృష్టించటమే పనిగా పెట్టుకుంది. ఇలా ఉగ్రవాదంపై దృష్టి పెట్టి దేశ అభివృద్ధిని కూడా మరిచిపోయింది. అంతా బాగానే ఉంది కానీ కొన్ని రోజుల్లో ఆఫ్ఘనిస్థాన్లో లాగానే అటు పాకిస్థాన్ లో కూడా తాలిబన్ల పాలన రాబోతుందా అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులు మాత్రం అలాగే కనిపిస్తున్నాయి. పాకిస్తాన్ పెంచి పోషించిన ఉగ్రవాదమే ఇప్పుడు అక్కడ ప్రమాదకరంగా మారిపోతుంది అనడానికి ఎన్నో ఘటనలు నిదర్శనంగా నిలుస్తున్నాయి.



 ఇటీవల కాలంలో మతోన్మాదంతో ఊగిపోయే తెహరికి తాలిబన్లు పాకిస్తాన్ సైనికులు ని చంపుతున్నా కూడా చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్న అక్కడి ప్రభుత్వం  ఇలా పాకిస్తాన్ లో కూడా తాలిబాన్ రాజ్యం కావాలంటూ ఏకంగా తెహరికి తాలిబన్లు ఎన్నో అరాచకాలు సృష్టిస్తున్నారు. ఇలా ఏకంగా పాకిస్తాన్ సైన్యం తాలిబన్ల చేతిలో కాల్పులకు పాకిస్తాన్ సైన్యం పిట్టల్లా రాలిపోతున్న అడిగే నాథుడే లేని పరిస్థితి. ఇక ఇటీవలే తెహెరికి తాలిబన్లు మరింత తెగించి అరాచకానికి పాల్పడ్డారు.



 పాకిస్తాన్ ఆర్మీ లో అద్భుత మైనటువంటి సేవలందించిన జనరల్ హరి సింగ్ నల్వా కు గుర్తుగా హరి పూర్ లో ఒక విగ్రహం ఏర్పాటు చేశారు. ఈ క్రమం లోనే ఇటీవల పాకిస్తాన్లో మతోన్మాద శక్తులు ఏకంగా ఆ విగ్రహాన్ని కూల్చేసి ఆ ప్రాంతాన్ని సాదిక్ అక్బర్ చౌక్ గా పేరు మార్చడం గమనార్హం. పాకిస్తాన్ లో ఇంత జరుగుతున్నా ఒక ఇమ్రాన్ ఖాన్ సైలెంట్ గానే ఉండి పోయారు. ఇదంతా చూస్తుంటే ఇక తాలిబన్ల   రాజ్యం రావడానికి ఇమ్రాన్ఖాన్ కూడా అంగీకరించినట్లు గానే వ్యవహరిస్తున్నారంటూ విశ్లేషకులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో ఏ క్షణంలోనైనా పాకిస్తాన్లో తాలిబన్లు రాజ్యం వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు అని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: