సముద్రం నుంచి కొట్టుకు వచ్చే శకలాలను సేకరించడం అతనికి ఎంతో ఇష్టం. తరచూ ఇలాంటిదే చేసేవాడు. ఈరోజు సాయంత్రం భార్యతో కలిసి సముద్రం ఒడ్డున విహరిస్తున్న సమయం లో దూరంగా తెల్లటి చేతులు నీటిపై తేలుతూ కనిపించడం గమనించాడు. అయితే ఎవరో అమ్మాయి సముద్రం లో మునిగి పోతుంది అని అనుకున్నాడు. ఇక పక్కన భార్య ఉంది అన్న విషయాన్ని మర్చి పోయి ఇక పరిగెత్తు కుంటూ వెళ్లి నీటిలోకి దూకి ప్రాణాలు కాపాడాలని అనుకున్నాడు. కానీ దగ్గరికి వెళ్లి చూసేసరికి అది తలలేని సెక్స్ టాయ్ అన్నది గమనించాడు.
అయితే హీరోలా వెళ్లి చివరికి ఒక సెక్స్ టాయ్ తో భర్త ఒడ్డుకు చేరడం తో భార్య ఎంతగానో నవ్వుకుందట. ఇక ఇలా ఈ విషయాన్ని ఇటీవలే ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఎవరో భార్య బాధితుడే ఈ పని చేసి ఉంటాడూ అని సదరు రిటైర్డ్ ఫోటో గ్రాఫర్ చమత్కరించాడు. ఇక ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం తో అందరూ ఇది చదివి కాసేపు నవ్వుకుంటున్నారు.