ఇలాంటి సమయంలోనే ఏ క్షణంలోనైనా రష్యా ఉక్రెయిన్ పై యుద్ధం చేసే అవకాశం ఉందని అటు రక్షణ రంగ నిపుణులు కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉండటం గమనార్హం. అయితే అటు చిన్న దేశమైన ఉక్రెయిన్ కి నాటో యూరోపియన్ యూనియన్ దేశాలు మద్దతు ఇస్తున్నాయ్. ఇప్పటికే ఎంతగానో ఆయుధ సంపత్తి కలిగిన రష్యా ఇతర దేశాల మద్దతు కోరక పోయినప్పటికీ మిత్ర దేశమైన చైనా... ఇక చైనా బానిస దేశమైన పాకిస్థాన్ రష్యా కు మద్దతుగా నిలిచే అవకాశం ఉందని రక్షణ రంగ నిపుణుల అంచనా. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఇటీవల చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ వ్యవహరించిన తీరు హాట్ టాపిక్ గా మారిపోయింది.
ఇటీవలే ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు సైన్యంలోని అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు జిన్పింగ్. ఇక ఈ సమావేశంలో ఎన్నో కీలక విషయాలపై చర్చించినట్లు తెలుస్తోంది.. ముఖ్యంగా రష్యా ఉక్రెయిన్ పై యుద్ధానికి దిగితే ఎలాంటి ఆర్థిక సహకారాన్ని అందించాలి.. అంతేకాకుండా ఆయుధాలను ఎలా తరలించాలి అన్న విషయంపై సైన్యాధికారులు తో చైనా ప్రభుత్వం చర్చించింది అన్నది తెలుస్తుంది. చైనా ఒక్కసారిగా అత్యవసర సమావేశం ఏర్పాటు మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.