ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక శక్తిగా నెంబర్ వన్ స్థానం లోకి వచ్చేందుకు ముఖ్యంగా అగ్రరాజ్యమైన అమెరికా ని వెనక్కి నెట్టెందుకు ఎప్పుడూ  ఏదో కుట్ర చేస్తూనే ఉంటుంది చైనా.  ఇలాంటి కుట్రలో భాగమే కరోనా వైరస్ అనే బయో వెపెన్ అన్నది శాస్త్రవేత్తలు చెబుతున్న మాట. కృత్రిమమైన వైరస్  తయారు చేసి చైనా ప్రపంచ వినాశనానికి పూనుకుంది అని ఇప్పటికి ఎంతో మంది శాస్త్రవేత్తలు చెప్పారు. అయితే కరోనా వైరస్ ముఖ్య ఉద్దేశం అటు అగ్రదేశాలు గా కొనసాగుతున్న అమెరికా బ్రిటన్ జపాన్ లాంటి దేశాలలో ఆర్థిక సంక్షోభం సృష్టించడమే అన్నది ఎంతో మంది నిపుణులు కూడా అంచనా వేశారు.



 ఈ క్రమంలోనే అటు అత్యాధునిక వైద్య సదుపాయాలు ఉన్నప్పటికీ బ్రిటన్ అమెరికా లాంటి దేశాలలో కరోనా వైరస్ మాత్రం ఏ దశలో తగినట్లుగా అనిపించలేదు. చివరికి ప్రస్తుతం చైనా అనుకున్నది జరుగుతుంది అని తెలుస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఉన్న అమెరికాలో అప్పులు 30 ట్రిలియన్ డాలర్లు పెరిగి పోయాయి అంటూ ఇటీవలే అక్కడి ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. వందేళ్లలో ఇదే రికార్డు స్థాయి అంటూ తెలిపింది. ఇందులో చైనాకు చెల్లించాల్సిన అప్పులు కూడా ఉన్నాయంటూ చెప్పింది. ఇక ఇప్పుడు మరో అగ్ర దేశమైన బ్రిటన్ లో కరోనా వైరస్ కారణంగా ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయింది అన్నది తెలుస్తుంది.



ద్రవ్యోల్బణం లో ఇటీవల బ్రిటన్లో 30 ఏళ్ల రికార్డు నమోదయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే బ్రిటన్లో అన్ని రకాల వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా ఇదిబ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పదవికి ఇది గండం గా మారిపోయింది అన్నది విశ్లేషకులు చెబుతున్న మాట. అయితే ప్రస్తుతం ద్రవ్యోల్బణం ఒక్కసారిగా పెరిగిపోయి అన్నిరకాల ధరలు పెరగడంతో బ్రిటన్ లోని ప్రజలందరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేపడుతున్నారూ అన్నది తెలుస్తోంది. ఇలా అగ్రరాజ్యాల ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీయాలనే చైనా లక్ష్యం నెరవేరుతుందని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: