ఇక్కడ మాత్రం ఇద్దరు భార్య భర్తల కు ఊహించని రీతిలో షాక్ తగిలింది. ఇటీవల ఇంటిని శుభ్రం చేస్తుండగా ఇంట్లో ఒక పురాతనమైన ట్రంకు పెట్టె కనబడింది. ఈ ట్రంకు పెట్టె ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఇందులో ఏముంది అని ఓపెన్ చేసి త్వరగా ఒక్కసారిగా ఆ కుటుంబ సభ్యులు నోరెళ్లబెట్టారు. ఇంతకీ ఆ పాత ట్రంకు పెట్టె లో ఏముంది అని అనుకుంటున్నారు కదా. తెలుసుకోవాలని ఆత్రుత కూడా పెరిగిపోయింది కదా. ఇక ఈ విషయం తెలుసుకోవాలంటే అసలు స్టోరీలోకి వెళ్లాల్సిందే మరి.
అమెరికాలోని ఓహియోలో నివాసం ఉంటున్న ఓ జంట తమ ఇంట్లో ఉన్న నేలమాళిగలను శుభ్రం చేశారు. ఈ క్రమంలోనే వారికి 70 ఏళ్ల నాటి పురాతన మైన ఒక ట్రంకు పెట్టె కనబడింది. ఇక పురాతనమైన ట్రంకు పెట్టె కావడంతో అందులో ఏమైనా ఆభరణాలు పురాతనమైన నాణాలు ఉంటాయని అనుకున్నారు. ట్రంకు పెట్టెలో ఏదో ఒకటి విలువైనది ఉంటే దశ తిరిగిపోతుంది అని అనుకున్నారు. ఇక ట్రంకు పెట్టె ఓపెన్ చేసి చూసి షాక్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళు అనుకున్నట్లుగా నగలు లాంటి ఆభరణాలు లేవు. పాతకాలపు డాలర్లు ఒక న్యూస్ పేపర్లో చుట్టి కనిపించాయి. ఇక వాటిని లెక్క పెట్టక ముప్పై మూడు లక్షలు గా తేలింది. ఇవి 1928 - 34 మధ్య కాలం నాటివిగా గుర్తించారు. ఇక దీనికి సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.