ఇటీవలి కాలంలో ఎంతోమంది ఫేమస్ అవ్వడానికి కూడా దయ్యాలు ఉన్నాయ్ అంటూ జనాలను నమ్మించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు అన్న విషయం తెలుస్తుంది. అయితే అసలు దెయ్యాలు ఉన్నాయా లేవా మాత్రం ఇప్పటికీ ఎవ్వరికీ తెలియని ప్రశ్న అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అది సరే గానీ ఇప్పుడు దయ్యాల గురించి ఎందుకు మాట్లాడు కోవాల్సి వచ్చింది అని అంటారా.. దయ్యాల గురించి కాదు ఏకంగా ఘోస్ట్ విలేజ్ గురించి ప్రస్తుతం మాట్లాడుకుంటున్నాము అని చెప్పాలి.
ఇక ఇలాంటివి విలేజ్ గురించి ఇప్పటి వరకు మీ జీవితంలో కానీ విని ఎరుగని ఉండరు. ఎందుకంటే దాదాపు 30 సంవత్సరాల క్రితం కనిపించకుండా పోయిన ఘోస్ట్ విలేజ్ ఒక్కసారిగా నీటి నుంచి బయటకు వచ్చింది. 1992లో ఒక రిజర్వాయర్ నిర్మించడంతో స్థానికంగా ఉన్న ఒక విలేజ్ పూర్తిగా నీటిలో మునిగిపోయింది. స్పెయిన్ పోర్చుగ్రెస్ సరిహద్దుల్లో ఈ ప్రాంతం ఉంది. ఇక ఇటీవల నీరు ఎండిపోవడంతో 30 సంవత్సరాల తర్వాత ఈ గ్రామం ఒక్కసారిగా బయటికి వచ్చింది. ఇక ఈ గ్రామాన్ని ఘోస్ట్ గ్రామం అంటూ పిలుస్తూ ఉంటారు.