ఇక మొదటి రోజు ఉక్రెయిన్ లో ఉన్న కీలకమైన సైనిక స్థావరాలు అన్నింటినీ కూడా ధ్వంసం చేయడానికి యుద్ధ విమానాలతో పాటు ఇక భారీగా క్షిపణులను కూడా ప్రయోగించి మారణహోమం సృష్టించింది రష్యా. ఇక నేడు అటు ఉక్రెయిన్ రాజధాని నగరమైన కీవ్ నగరం ను టార్గెట్గా చేసుకుంటూ ఇక మిస్సైల్ తో విరుచుకు పడుతుంది అన్నది తెలుస్తుంది. ఏకంగా జనావాసాల పై దాడులకు పాల్పడుతూ ఉండడంతో ఉక్రెయిన్ లో ప్రజలందరూ ప్రాణభయంతో పరుగులు పెడుతున్నారు. అయితే నిన్న ఉక్రెయిన్ సైనిక వైమానిక స్థావరాలను లక్ష్యంగా దాడులకు పాల్పడిన రష్యా 83 స్థావరాలను ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది.
ఇక ఇందులో ఏకంగా 137 మందికిపైగా ఉక్రెయిన్ పౌరులు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా వందలాది మంది తీవ్ర గాయాలపాలయ్యాయ్. చిన్న దేశం అని కూడా చూడకుండా రష్యా భీకరమైన దాడులు చేస్తూ ఉండడంతో ఉక్రెయిన్ బలాగాలు సైనిక సమీకరణకు అధ్యక్షుడు ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. ఇక రానున్న 90 రోజుల పాటు అమలులో ఇవి ఉండబోతున్నాయి అంటూ తెలిపారు ఉక్రెయిన్ అధ్యక్షుడు. ఈ క్రమంలోనే రష్యా ఎక్కడా వెనక్కి తగ్గకుండా దాడులతో విరుచుకుపడుతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లోపరిస్థితులు ఎక్కడ వరకు దారి తీస్తాయి అన్నది కూడా ఊహకందని విధంగా మారిపోయింది.