ఇలా ఉక్రెయిన్ పై తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్న రష్యా తీరుపై జట్టు ప్రపంచ దేశాలు మాత్రం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వెనక్కి తగ్గాలంటూ నిరసనలు కూడా చేస్తూ ఉండటం గమనార్హం. ఇలాంటి సమయంలోనే అమెరికా బ్రిటన్ ఫ్రాన్స్ తో పాటు అనేక పశ్చిమ దేశాలు కూడా రష్యా పై తీవ్రస్థాయిలో ఆంక్షలు విధిస్తూ ఉండటం గమనార్హం. రష్యా రానున్న రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నాయి. ఇక ఇప్పుడు రష్యా యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ టెక్ దిగ్గజం అయిన యాపిల్ తమ ఉత్పత్తుల విక్రయాలను నిషేధిస్తున్నట్లు ఇటీవలే ప్రకటన చేసింది.
ఆన్లైన్ ఆఫ్లైన్లో కూడా తమ ఉత్పత్తుల అమ్మకాలను రష్యాలో పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఇక రష్యాలో కస్టమర్లు మాక్స్, ఐ ఫోన్లు, ఐపాడ్లు ఇతర యాపిల్ పరికరాలను కొనుగోలు చేయడానికి వీలు ఉండదు. ఒకవేళ ఆన్లైన్లో కొనుగోలు చేయడానికి ప్రయత్నించిన రష్యాలో లొకేషన్ ఉంటుంది కనుక డెలివరీ మాత్రం అందుబాటులో ఉండదు. ఉక్రేనియన్ వైస్ ప్రైమ్ మినిస్టర్ చేసిన విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు యాపిల్ సీఈవో టిం కుక్. ఇక రష్యా దురాక్రమణను ఆపేందుకు ఉన్న ప్రతి అవకాశాన్ని కూడా ఉక్రెయిన్ ఉపయోగించుకుంటూ ఉండటం గమనార్హం.