యూరోపియన్ యూనియన్ లో చేరేందుకు సిద్ధమైన ఉక్రెయిన్ చేరవద్దు అంటూ ముందుగా సూచించింది రష్యా. కానీ మేము స్వతంత్ర దేశం.. నా ఇష్టం ఉన్న వారితో కలుస్తా అంటూ ఉక్రెయిన్ చెప్పింది. ఇలాంటి నేపథ్యంలోనే ఏకంగా రష్యా సైనికులను సరిహద్దుల్లో పంపించి యుద్ధ విన్యాసాలు చేయడం  సంచలనం గా మారిపోయింది. ఈ క్రమంలోనే ఏ క్షణంలో ఇరు దేశాల మధ్య యుద్ధం తలెత్తుతుందో అన్న విధంగా పరిస్థితులు మారిపోగా చివరికి రష్యా యుద్ధానికి సిద్ధమైపోయింది.



 గత కొన్ని రోజుల నుంచి రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం తీవ్ర రూపం దాల్చింది అన్న విషయం తెలిసిందే. రష్యా సైన్యం క్కడ వెనకడుగు వేయకుండా ఉక్రెయిన్ పై భీకర రీతిలో దాడులకు పాల్పడుతోంది. ఈ క్రమంలోనే ఉక్రెయిన్ లో అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. అయితే మొన్నటి వరకు సైనిక స్థావరాలపై దాడి చేసిన రష్యన్ సైనికులు ఇక ఇప్పుడు జనావాసాల్లో కూడా దాడులకు పాల్పడుతున్నారు. సాధారణ పౌరులను సైతం కాల్చి చంపుతున్నారు.


 అంతేకాదు ఉక్రెయిన్ పౌరుల పట్ల రష్యన్ సైనికులు దారుణంగా వ్యవహరిస్తున్నారంటూ టాక్ వినిపిస్తోంది. ఇలాంటి సమయంలో విదేశాంగ శాఖ మంత్రి గులేబా సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా ఆక్రమించిన నగరాల్లోని మహిళలపై రష్యన్ సైనికులు అత్యాచారాలకు పాల్పడుతున్నారు అంటూ ఆయన ఆరోపించారు. ఒకపక్క బాంబుల మోత మరోవైపు ఆడపిల్లలపై అత్యాచారాలు జరగడం చూస్తుంటే ఎంతో బాధ కలుగుతుంది అని చెప్పుకొచ్చారు. జాతీయ చట్టాలు ఎంత బలహీనంగా ఉన్నాయో తెలుస్తుంది అని వ్యాఖ్యానించారు. రష్యా దూకుడుగా వ్యవహరిస్తోందని ప్రతిచర్యకు బాధ్యత వహించాల్సి ఉంటుంది అంటూ వ్యాఖ్యానించారు ఆయన.. ఇక ఉక్రెయిన్ పై రష్యా దారుణంగా యుద్ధం చేస్తూ ఉండడాన్ని అటు ప్రపంచ దేశాలు మాత్రం తీవ్రస్థాయిలో తప్పుబడుతున్నాయ్. ఈ క్రమంలోనే రష్యాపై ఆర్థికపరమైన సాంకేతిక పరమైన ఆంక్షలు విధిస్తూ ఉండటం గమనార్హం

మరింత సమాచారం తెలుసుకోండి: