
అదే సమయంలో అటు ఉక్రెయిన్ సేనలు కూడా వీరోచితంగా పోరాటం చేస్తున్నాయ్ అన్న విషయం తెలిసిందే. అయితే ఉక్రెయిన్ కి అమెరికా యూరోపియన్ యూనియన్ నాటో దేశాలు మద్దతు ఇస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ దేశాలు గనక యుద్ధం లో పాల్గొంటే ఇక మూడో ప్రపంచ యుద్ధం రావడం ఖాయమని ఇప్పటికే రక్షణ రంగ నిపుణులు అంచనా వేశారు. ఇక ఇలాంటి సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ బాంబు పేలుళ్లు జరిగిన అందరూ ఒక్కసారిగా ఉలిక్కి పడుతున్నారు. ఇటీవల భారత్ ప్రయోగించిన ఒక మిస్సైల్ సాంకేతిక లోపం కారణంగా పాకిస్థాన్లో పడటం సంచలనంగా మారిపోయింది. ఈ ఘటనతో అందరూ కాస్త ఆందోళన చెందారు.
ఇక ఇప్పుడు మరో సారి అందరూ ఉలికిపడే ఘటన చోటుచేసుకుంది. ఇరాక్ లో ఉన్న అమెరికా రాయబార కార్యాలయంపై మిస్సైల్ దాడి జరగడం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిపోయింది. ఆ రాయబార కార్యాలయం కొత్త భవనం కావడంతో అక్కడ ఎవరూ లేరు. దీంతో ప్రాణ నష్టం తప్పింది అని తెలుస్తోంది. ఆదివారం తెల్లవారుజామున మిస్సైల్ దూసుకువచ్చి ఇక అమెరికా రాయబార కార్యాలయం ఆవరణలో పడినట్లు తెలుస్తోంది. ఇది ఇరాన్ సమీప దేశాలనుంచి దూసుకు వచ్చి నట్లు అధికారులు గుర్తించారు. ఘటనపై అమెరికా ఇరాన్ కూడా దర్యాప్తు చేపట్టడం గమనార్హం..