కానీ నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత మాత్రం మనుషుల్లో మానవత్వం కాదు పగ ప్రతీకారాలు కుళ్లు కుతంత్రాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అన్నది మాత్రం తప్పక అర్థమవుతూ ఉంటుంది. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. సాధారణంగా స్కూల్ కి వెళ్ళినప్పుడు ఏ టీచర్ అయినా సరే విద్యార్థిని సరిగ్గా చదవనప్పుడు.. లేదంటే ప్రవర్తన బాలేనప్పుడు ఇక మందలించడం లాంటివి చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే కొంత మంది విద్యార్థులు మాత్రం ఇది అవమానంగా భావిస్తూ ఉంటారు. ఇలాంటి సమయంలోనే ఇక ఎంతగానో బాధపడిపోతుంటారు. ఇక్కడ ఓ విద్యార్థి స్కూల్ టీచర్ మందలించాడాన్ని అవమానంగా భావించాడు.
దీంతో ఆ స్కూల్ టీచర్ పై కక్ష పెంచుకున్నాడు. 30 ఏళ్ల వరకు పగతో రగిలిపోయాడు. చివరికి 30 ఏళ్ల తర్వాత దారుణంగా తనను అవమానించిన టీచర్ ను హత్య చేసి పగ తీర్చుకున్నాడు. ఈ ఘటన అందరినీ ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. 1990 లో చదువుకునేటప్పుడు అవమానించిన స్కూల్ టీచర్ ను 30 ఏళ్ల తర్వాత దారుణంగా చంపేశాడు. ఏకంగా 101 సార్లు కత్తితో పొడిచాడు. ఈ ఘటన బెల్జియంలో వెలుగులోకి వచ్చింది. ఇక దర్యాప్తు మొదలు పెట్టిన పోలీసులు వందమంది డీఎన్ఏ పరీక్షించిన ప్రయోజనం లేకుండా పోయింది. ఇటీవలే టీచర్ ను హత్య చేసిన విషయాన్ని సదరు యువకుడు స్నేహితుడికి చెప్పగా.. స్నేహితుడు పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో అతని డిఎన్ఏ పరీక్షించగా అతడే నేరం చేసినట్లు రుజువైంది..