ఇటీవలికాలంలో చికెన్ ధరలు ఎంత పెరిగిపోతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రోజురోజుకు పెరిగిపోతున్న చికెన్ ధరలు పాటు సామాన్యులను ఆందోళన కలిగిస్తున్నాయి అని చెప్పాలి. మటన్ ధరలు ఎక్కువగా ఉండడంతో మాంసం తినాలని కోరిక కలిగిన సామాన్యులు చికెన్ తింటూ సరిపెట్టుకునే వారు. కానీ ఇప్పుడు చికెన్ ధరలు కూడా అంతకంతకూ పెరిగి పోతూ ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో ప్రతి ఒక్కరు కూడా ఆందోళన చెందుతున్నారు అని చెప్పాలి. దాదాపు తెలుగు రాష్ట్రాల్లో కిలో చికెన్ ధర మూడు వందలకు పైగానే పలుకుతుంది.



 ఇక ఇప్పుడు కిలో చికెన్ ధర ఏకంగా వెయ్యి రూపాయలకు పెరిగిపోయింది అంటూ ఒక వార్త వైరల్ గా మారిపోయింది. ఇది చూసి సామాన్య ప్రజలందరూ కూడా బెంబేలెత్తిపోతున్నారు. ఇక మీరు కూడా ఆందోళన చెందుతున్నారు కదా.. అంతగా ఆందోళన చెందకండి.. ఎందుకంటే కిలో చికెన్ ధర వెయ్యి రూపాయలు అయింది నిజమే.. కానీ ఇది మన దేశంలో కాదు శ్రీలంకలో. శ్రీలంక దేశంలో గత కొన్ని రోజుల నుంచి తీవ్రమైన ఆర్థిక ఆహార సంక్షోభం పెరిగిపోతూ ఉంది. ఈ క్రమంలో అక్కడి ప్రజలందరూ కూడా ఆకలితో అలమటించే పరిస్థితి ఏర్పడింది. మూడు పూటలా తిండి దొరకని దుస్థితి వచ్చింది. ఇక నిత్యావసరాల ధరలు అమాంతం పెరిగి పోవడంతో.. ఎంతోమంది పేద ప్రజలు పస్తులుంటున్నారు.


 ఇక ఇప్పుడు శ్రీలంకలో ఏకంగా ఒక్కో కోడి గుడ్డు ధర 35 రూపాయలు పలుకుతోంది అంటే అక్కడ ఆర్థిక సంక్షోభం ఎలా పెరిగిపోయిందో అర్థం చేసుకోవచ్చు. అదే సమయంలో ఇక కిలో చికెన్ ఏకంగా వెయ్యి రూపాయలకు పైగానే పెరిగింది. ఇక పెట్రోల్ డీజిల్ కిరోసిన్ ధరలు అయితే సామాన్యులకు అందనంత దూరం లోకి వెళ్ళిపోయాయ్. లీటర్ పెట్రోల్ ధర 283 రూపాయలుగా ఉండగా డీజిల్ ధర 220 రూపాయలుగా ఉంది. ఇక అక్కడ కరెంటు ఊసే లేకుండా పోయింది. ఆర్థిక సంక్షోభం మరింత ముదరడంతో అక్క హోటల్స్ అన్ని మూతపడ్డాయి  చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: