రష్యా వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు నుంచి కాదు కొన్ని నెలల నుంచి ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారి పోతుంది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే చిన్న దేశమైన ఉక్రెయిన్ పై తమ ఆధిపత్యాన్ని సాధించాలని ప్రయత్నాలు మొదలు పెట్టిన రష్యా ఇక ఎన్నో రోజుల నుంచి ఉక్రెయిన్ పై బెదిరింపులకు పాల్పడుతూ ఉంది. సరిహద్దుల్లో యుద్ధ విన్యాసాలు చేస్తూ ఎప్పుడు ఉద్రిక్త పరిస్థితులకు కారణమవుతు ఉంది. తరువాత ఏకంగా అకస్మాత్తుగా సైనిక చర్యలను ప్రారంభించిన రష్యా యుద్ధం చేస్తూ ఉంది. ఇక తమ దేశం బలంతో ఎక్కడ సరితూగని ఉక్రెయిన్ పై విరుచుకుపడుతూ రాక్షస ఆనందం పొందుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.



 రష్యా దాడి నేపథ్యంలో అటు గ్రామాల్లో పరిస్థితులు రోజురోజుకీ అధ్వానంగా మారిపోతున్నాయి. అక్కడి ప్రజలందరూ ఏ క్షణంలో బాంబులు మీద పడి ప్రాణాలు కోల్పోతామో అని భయం భయంగానే బ్రతుకు వెళ్ళదీయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పలుమార్లు ఈ రెండు దేశాల మధ్య శాంతి చర్చలు జరిపినప్పటికీ.. ఉక్రెయిన్ తమ చెప్పుచేతల్లో ఉండాలి అంటూ రష్యా పట్టుబట్టడంతో చివరికి శాంతి చర్చలు విఫలం అవుతూనే ఉన్నాయి. అయితే జనావాసాలు తలదాచుకున్న బంకర్లనే టార్గెట్గా చేసుకుంటూ రష్యా దారుణంగా దాడులకు పాల్పడుతూ ఉండడంతో ఉక్రెయిన్ లో మారణహోమం జరుగుతుంది అని చెప్పాలి.


 ఇక ఉక్రెయిన్ తీరుపై నిరసిస్తూ ప్రపంచ దేశాలు ఆంక్షలు విధించిన రష్యా తీరులో మాత్రం మార్పు రావడం లేదు. ఇక ఇప్పుడు రష్యా మరో దాష్టీకానికి పాల్పడింది అన్నది తెలుస్తుంది. సుమారు 2389 ఉక్రెయిన్ చిన్నారులను రష్యా కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఇటీవలే ప్రకటించింది ఉక్రెయిన్. రష్యా ఆక్రమించిన డాన్ బాస్ ప్రాంతంలో దాదాపు రెండు వేల మందికి పైగా చిన్నారులు కనిపించడం లేదని.. ఇక వారందరినీ రష్యా కిడ్నాప్ చేసింది అంటూ ఉక్రెయిన్ ఆరోపిస్తూ ఉండటం గమనార్హం. ఈ విషయాన్ని ఉక్రెయిన్ విదేశాంగ శాఖ చెప్పింది..

మరింత సమాచారం తెలుసుకోండి: