
కేవలం మొక్కుబడిగా మాత్రమే కొన్ని ఆయుధాలను ఇస్తూ ఉంది. ఇక అదే సమయంలో ఆర్థిక ఆంక్షలు విధిస్తూ ఉండటం గమనార్హం. దీంతో ఇక అమెరికాను నమ్ముకొని రష్యాను ఎదుర్కొనేందుకు సిద్ధమైన ఉక్రెయిన్ ఇప్పుడు అగ్రరాజ్యం తో ఒంటరిగానే పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి సమయంలో కొన్ని దేశాలు ఉక్రెయిన్ కి మద్దతు పలుకుతూ ఉంటే మరికొన్ని దేశాలు రష్యా కు మద్దతు పలుకుతూ ఉన్నాయి. అయితే అటు భారత్ మాత్రం ఒకవైపు రష్యాకు మరోవైపు ఉక్రెయిన్కు మద్దతు పలకకుండా తటస్థ వైఖరిని అవలంబిస్తోన్నాయ్. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచిస్తుంది.
ఈ క్రమంలోనే భారత్ వ్యవహరిస్తున్న తీరుపై ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ షాకింగ్స్ కామెంట్స్ చేశాడు. రష్యాతో మాట్లాడేందుకు భారత్ భయపడుతుంది అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసాడు. ఇక ఆ దేశంపై భారత్ నిర్ణయాల్లో అస్థిరత కనిపిస్తోంది అంటూ వ్యాఖ్యానించారు బైడెన్. క్వాడ్ దేశాలైన అమెరికా ఆస్ట్రేలియా జపాన్ భారత్ ఒక్క తాటిపైకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఈ విషయంలో భారత్ బలహీనంగా ఉందని జపాన్ ఆస్ట్రేలియా పటిష్టంగా కన్పిస్తోందని అంటూ చెప్పుకొచ్చాడు అమెరికా అధ్యక్షుడు బైడెన్.