ఇటీవలికాలంలో ఆంటీ అని పిలిపించుకోవడానికి ఎవరూ ఇష్టపడటం లేదు. ఏకంగా 30 ఏళ్లు దాటి పోతున్నా 40 ప్లస్ లోకి వచ్చినా కూడా ఆంటీ అని పిలిస్తే తెగ ఫీల్ అయిపోతున్నారు. అక్క అని పిలవాలి అంటూ సూచిస్తున్నారు.కానీ ఇక్కడ ఒక మహిళ మాత్రం 30 ఏళ్లకే ఆంటీ అని కాదు ఏకంగా అమ్మమ్మ అని పిలిపించుకుంటుంది. పిలిపించుకోవడం అంటే ఏదో సరదాగా కాదు ఏకంగా సొంత మనడి తోనే అమ్మమ్మా అని పిలిపించుకునే స్టేజీకి వచ్చేసింది. అదేంటి ముప్పై ఏళ్లకు అమ్మమ్మ అవడం ఏంటి ఇది ఏదో కాస్త విచిత్రంగా ఉందే అని అనిపిస్తుంది కదా.


 నిజంగానే కాస్త విచిత్రమైన ఘటన  ఇక్కడ జరిగింది. 30 ఏళ్ల వయసులో ఇంకా తాము అమ్మాయిలం అని పిలిపించుకోవడానికి ఇష్టపడుతున్న నేటి రోజుల్లో ఆ అమ్మాయి మాత్రం ఏకంగా అమ్మమ్మా అనిపించుకుంటుంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. సదరు మహిళకు చిన్న వయసులోనే పెళ్లి చేశారు. కొన్నాళ్ళకే ఇక ఆమెకు ఒక కూతురు కూడా పుట్టింది. ఇక కూతురే సర్వస్వంగా బ్రతికింది సదరు మహిళ. ఇటీవలే కూతురు 14 ఏళ్ల వయసుకు వచ్చింది. అయితే 14 ఏళ్ల వయసుకే సదరు మహిళ కూతురు కూడా ఒక బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఇక సదరు మహిళ 30 ఏళ్లకే ఏకంగా అమ్మమ్మా అని గెలిపించుకునే స్టేజ్ కు వెళ్ళిపోయింది. ఈ ఘటన బ్రిటన్లో వెలుగులోకి వచ్చింది.


 అత్యంత యువ బామ్మ ఎవరు అనే చర్చ జరిగిన సందర్భంలో ఇక ఈ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది అన్నది తెలుస్తుంది. హీలే అనే మహిళ కూతురు సాల్జర్ 14 ఏళ్లకే బిడ్డకు జన్మనివ్వడం తో ఇక అత్యంత యువ అమ్మమ్మా గా మారిపోయింది సదరు మహిళ. హీలే కూతురు సాల్జర్ ఓ యువకుడితో రిలేషన్ షిప్ లో కొనసాగుతూ చివరికి గర్భం దాల్చింది. ఇక వైద్యులు అబార్షన్ కి ఒప్పుకోకపోవడంతో2018 లో ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఇకపోతే ఇలా 14 ఎల్లకె బిడ్డకు జన్మనిచ్చిన బాలిక తల్లికి 33 ఏళ్లు. అయితే నా మనవడి ని చూసి కొడుకు అని అనుకుంటున్నారు అని ఇకయువ అమ్మమ్మ చెబుతూ ఉండటం గమనార్హం..

మరింత సమాచారం తెలుసుకోండి: