ప్రస్తుతం రష్యాలో తీవ్రస్థాయిలో సంక్షోభం ఏర్పడుతుంది అన్న విషయం తెలిసిందే. ఇక దీనికి కారణం అటు రష్యా చేజేతులారా చేసుకున్నది. పొరుగున వున్న ఉక్రెయిన్ పై ఆధిపత్యం సాధించడం కోసం రష్యా ఏకంగా ఆర్మీ ఆపరేషన్ ప్రారంభించింది. ఈ క్రమంలోనే అన్ని రకాల ఆయుధాలతో యుద్ధానికి దిగింది. దాదాపు యుద్ధం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నాయి అని చెప్పాలి. అయినప్పటికీ పరిస్థితుల్లో మాత్రం ఎక్కడ మార్పు రావడంలేదు. అదే సమయంలో అమెరికా యూరోపియన్ యూనియన్ దేశాలు రష్యాపై ఆర్థిక పరమైన ఆంక్షలు విధిస్తున్నాయ్.


 అంతే కాదు అన్ని రకాల దౌత్య సంబంధాలను కూడా తెంచచుకుంటున్నట్లు ప్రకటిస్తున్నాయి. దీంతో ఇక రష్యా నుంచి ముడి చమురు దిగుమతులను కూడా నిలిపివేయడంతో రష్యా లో ఒక్కసారిగా క్రూడ్ ఆయిల్ నిల్వలు నిండిపోయాయి. ఇలాంటి సమయంలోనే ఇక భారత్ చైనా లాంటి దేశాలకు ఏకంగా 25% డిస్కౌంట్ తో ఇక ఆయిల్ దిగుమతి చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది రష్యా. ఇలాంటి సమయంలోనే ఇక ఆయిల్ బావుల వద్ద కొత్తగా తవ్వకాలు చేపట్టడానికి యుద్ధం కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇదే సమయాన్ని తమకు అనుకూలంగా మార్చుకున్న సౌదీ అరేబియా ఇక ఇప్పుడు ప్రపంచ దేశాలకు ముడిచమురు పంపిణీ లో మొదటి స్థానం లోకి వచ్చేసింది అన్నది తెలుస్తుంది.


 మొన్నటివరకు ఏకంగా ప్రపంచ దేశాలలో 45 శాతం వరకు రష్యా ఆయిల్ పంపిణీ చేసేది. ఇక ఇప్పుడు రష్యా యుద్ధం నేపథ్యంలో ఏకంగా అక్కడ ఆయిల్ బావుల వద్ద ఇబ్బందులు ఏర్పడుతూ నేపథ్యంలో ఇక రష్యాను వెనక్కినెట్టి సౌదీ అరేబియా మొదటి స్థానం లోకి వచ్చింది.  ప్రపంచంలోనే అత్యధిక ముడి చమురు సరఫరా చేసే దేశంగా అగ్రస్థానంలో కొనసాగుతోంది సౌదీ అరేబియా. ఇలా ముడి చమురు ఎగుమతులు ఒక్కసారిగా తగ్గిపోవడంతో ఇక రష్యా కు మరింత నష్టం వాటిల్లుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: