అయితే గత కొంత కాలం నుంచి ఉత్తర కొరియాలో ఆహార సంక్షోభం వేధిస్తూ ఉన్నప్పటికీ అధ్యక్షుడు కిమ్ మాత్రం వరుసగా క్షిపణుల ఉపయోగాలు నిర్వహిస్తుండటం గమనార్హం. ఇటీవల అత్యంత శక్తివంతమైన ఖండాంతర క్షిపణిని విజయవంతంగా ప్రయోగించారు కిమ్. 2017 తర్వాత నిషేధిత ఖండాంతర క్షిపణి ఇప్పుడే ప్రయోగించడం గమనార్హం. ఇకపోతే ఇటీవల 2017 నాటి మిస్సైల్ ప్రయోగాన్ని హాలీవుడ్ మూవీ రేంజ్ లో ఫుటేజీని విడుదల చేసింది ప్రభుత్వం. ఇందులో ఒక పాత స్కూల్ కి సమీపంలో కిమ్ లెదర్ జాకెట్ ధరించి ఇక అతి పెద్ద క్షిపణి హ్వాసన్ 17ను ప్రారంభించడానికి సిద్ధమవుతూ ఉంటాడు.
ఉత్కంఠభరితమైన సంగీతంలో అనేక ఇతర జనరల్స్ వచ్చి కెమెరా యాక్షన్ అనగానే స్లో మోషన్ లో కి వచ్చి గ్లాసెస్ పగలగొట్టి క్షిపణి ప్రయోగానికి ఆమోదం తెలుపుతున్నట్లు కనిపిస్తూ ఉంటుంది వీడియోలో. సైనికులందరూ అగ్ని అరుస్తున్న ట్లుగా కనిపిస్తూ ఉంటుంది. ఇక దీన్ని ఒక చలన చిత్రంగా రూపొందించి మరి సంబరాలు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఇటీవల ప్రయోగించిన క్షిపణి విజయవంతమైన నేపథ్యంలో ఇక ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ హీరోగా క్షిపణి ప్రయోగానికి సంబంధించిన వీడియోని రూపొందించినట్లు అక్కడి అధికారులు తెలిపారు. అయితే ప్రస్తుతం ఉత్తర కొరియా చలనచిత్ర నిర్మాణం కోసం నిధులు కేటాయిస్తుంది. కానీ ఇక అక్కడ తెరకెక్కించే సినిమాలు మొత్తం కిమ్ కుటుంబాన్ని కీర్తిస్తూ ఉండాలి.