ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం ఎంత తీవ్ర రూపం దాల్చినదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఇరు దేశాల మధ్య యుద్ధం మొదలై దాదాపు నెల రోజులు గడిచిపోతున్నాయి. పరిస్థితుల్లో మాత్రం మార్పు రావడంలేదు. రష్యా పసికూన లాంటి ఉక్రెయిన్ పై విరుచుకుపడుతూ ఉండడంతో ప్రస్తుతం ఉక్రెయిన్లో అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. అయితే సైనికులతో పాటు సాధారణ పౌరులు కూడా ప్రాణాలు కోల్పోతూ ఉన్న నేపథ్యంలో ఉక్రెయిన్ లో  పరిస్థితులపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. అంతే కాదు రష్యా తీరును కూడా తీవ్రంగా తప్పు పడుతూ ఉండటం గమనార్హం.


 ఈ క్రమంలోనే ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ ఎన్నో దేశాలు ఇప్పటికే రష్యా పై ఆంక్షలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఉక్రెయిన్ తో యుద్ధం చేస్తున్న రష్యా మరికొన్ని రోజుల్లో జపాన్ తో కూడా యుద్ధం చేయబోతుందా అంటే ప్రస్తుత పరిస్థితి చూస్తే అలాగే ఉంది అంటున్నారు నిపుణులు. ఎందుకంటే ప్రస్తుతం రష్యా కన్ను జపాన్ పై పడింది అన్నది తెలుస్తుంది. జపాన్ కు సమీపంలో ఉన్న కురిల్ ద్వీపాల్లో రష్యా సైన్యం భారీగా యుద్ధ విన్యాసాలు చేస్తూ ఉండటం ప్రస్తుతం అంతర్జాతీయ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక ఈ ద్వీపాల విషయంలో రష్యా జపాన్ మధ్య ప్రస్తుతం తీవ్ర స్థాయిలో వివాదాలు కొనసాగుతున్నాయి అన్న విషయం తెలిసిందే.


 ఎన్నో ఏళ్ల నుంచి రష్యా జపాన్ మధ్య ఇక ఈ ద్వీపాల విషయంలో చర్చలు జరుగుతూనే వస్తున్నాయి. అదే సమయంలో ఇక ఉక్రెయిన్ రష్యా యుద్ధం ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ జపాన్ ఇటీవలే రష్యా పై పలు ఆంక్షలు విధించింది. దీనికి ప్రతి చర్యగా కురుల్ ద్వీపాల విషయంలో రష్యా జపాన్ మధ్య జరుగుతున్న చర్చల నుంచి తప్పుకుంది. ఇక అంతలోనే ఏకంగా ఆ ద్వీపాలకు సమీపంలో రష్యా యుద్ధ విన్యాసాలు చేస్తూ ఉండటం మాత్రం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈ క్రమంలోనే జపాన్ ఎలా స్పందించి పోతుందో అన్నది చర్చనీయాంశంగా మారిపోయింది. పరిస్థితులు ఎక్కడ వరకు దారితీస్తాయో చూడాలి మరి..

మరింత సమాచారం తెలుసుకోండి: