ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదాన్ని పూర్తిగా నాశనం చేస్తాము.. ప్రపంచాన్ని ఉగ్రవాద రహితంగా మారుస్తాం.. ఏ దేశమైనా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడితే సహించబోం.. ఇక ఎప్పుడూ ఇక ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటుంది అగ్రరాజ్యమైన అమెరికా. కానీ తమ అవసరాలకు అనుగుణంగా అదే ఉగ్రవాదులను ఉపయోగించుకుంటూ ఇతర దేశాల పై పగ తీర్చుకోవడం లాంటివి చేస్తూ ఉంటుంది. ఇలాచివరకు ఎన్నోసార్లు ఉగ్రవాదులను వాడుకొని వదిలేస్తుంది అమెరికా.


 చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు చేసేవన్నీ దిక్కుమాలిన పనులు అనే ఒక సామెత అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇక ఇప్పుడు అమెరికా చేసిన పని ఈ సామెతకు సరిగ్గా సరిపోతుంది. ఉగ్రవాదాన్ని రూపు మాపటం అంటూ శబతాలు   చేసే అమెరికా ఇక ఇప్పుడు అదే ఉగ్రవాద దేశానికి ఆయుధాలను అమ్మేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం పాకిస్తాన్ తో పాటు టర్కీ కూడా ఉగ్రవాద దేశంగా ఐక్యరాజ్య సమితిలో గుర్తించ  బడింది. ఈ క్రమంలోనే ఏపిటిఎఫ్ నిబంధనల్లో భాగంగానే గ్రే లిస్టులో కొనసాగుతోంది టర్కీ. ఉగ్రవాద కార్యకలాపాలు జరిగే వరకు ఇలాంటి దేశానికి ఎలాంటి ఆయుధాలు అమ్మ కూడదు అనే నిబంధన కూడా ఉంది.


 అని అలాంటి ఉగ్ర దేశమైన టర్కీకి అమెరికాఎఫ్ 16 యుద్ధ విమానాలను అమ్మేందుకు సిద్ధమైంది అన్నది తెలుస్తుంది. ఇటీవల ఈ విషయాన్ని అమెరికా అధికారికంగా ప్రకటించడం గమనార్హం.  తమ మధ్య ఉన్న మిత్రుత్వం  దృశ్య.. ఇక వాణిజ్యం దృశ్య ఇక తాము ఎఫ్ 16 యుద్ధ విమానాలను అమ్మేందుకు సిద్ధమయ్యాము అంటూ అమెరికా ప్రకటించింది. టర్కీ నాటో కూటమి లో సభ్య దేశం కావడం వల్లనే ఇక ఇలా ఆయుధాలు అమ్మేందుకు సిద్ధమయ్యాము అంటూ అమెరికా వివరణ ఇవ్వడం గమనార్హం.. ఇలా ఉగ్ర దేశానికి ఆయుధాలు ఇవ్వడానికి సిద్ధమైన అమెరికా భవిష్యత్తులో ఎలాంటి ప్లాన్ చేయబోతుంది అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: