ఉక్రెయిన్ లో పరిస్థితి చూసి ప్రస్తుత ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మొన్నటికి మొన్న కాస్త వెనక్కి తగ్గినట్లు కనిపించినా రష్యా మరో వైపు నుంచి దాడి దిగుతూ ఉంది. ఎడతెరిపి లేకుండా రష్యా సైన్యం దాడులు చేస్తున్న నేపథ్యంలో మొన్నటి వరకు వీరోచితంగా పోరాడిన ఉక్రెయిన్ సైనికులు ప్రస్తుతం వెనకడుగు వేస్తున్నారు అన్నది తెలుస్తోంది. అయితే ప్రపంచ దేశాలు రష్యాపై ఆర్థిక పరమైన ఆంక్షలు తో పాటు అన్ని రకాల సంబంధాలు తెంచుకుంటూ ఉన్నప్పటికీ రష్యా మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ఇక జనావాసాల పై కూడా దాడులు చేస్తూ ఏకంగా మారణహోమానికి కారణమవుతుంది.  ఈ క్రమంలోనే ప్రస్తుతం ఉక్రెయిన్ లో అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్నాయ్ అని చెప్పాలి.



 అయితే ఇలా దాడులకు పాల్పడుతూ ఉక్రెయిన్ సైన్యాన్ని హతమారుస్తూ ఎక్కడికక్కడ ఎన్నో ప్రాంతాలను రష్యా సైన్యం తమా ఆధీనంలోకి తెచ్చుకుంది. అయితే సైనికులు అన్న తర్వాత ఇలా యుద్ధం చేయడం కొన్ని ప్రాంతాలను ఆధీనంలోకి తెచ్చుకోవడం సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. కానీ రష్యా సైన్యం మాత్రం దారుణంగా వ్యవహరిస్తున్నారు. కంటపడిన ఉక్రెయిన్ ఆడపిల్లలపై దారుణంగా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. చిన్నపిల్లలు ముసలివాళ్లు అని కూడా చూడకుండా అత్యాచారాలకు పాల్పడుతు నీచాతి నీచంగా ప్రవర్తిస్తున్నారు అన్న విషయాన్ని ఉక్రెయిన్లో ఉన్న అధికారులు ప్రభుత్వం కూడా ఆరోపిస్తూ ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.


 అయితే రష్యా సైన్యం అత్యాచారాలకు పాల్పడెందుకు ఏకంగా రష్యా లో ఉన్నటువంటి తమ భార్యల పర్మిషన్ కూడా తీసుకుంటున్నారు అన్న విషయం తెలుస్తుంది. ఏకంగా ఇలా ఉక్రెయిన్ పై దాడి చేస్తున్న రష్యా సైనికుల భార్యలు ఉక్రెయిన్ లో ఉన్న మహిళపై అత్యాచారం చేయాలంటూ చెబుతూ ఉండడం సంచలనంగా మారిపోయింది. ఇటీవలే ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీసెస్ రష్యా సైనికులతో వారి భార్యలు మాట్లాడే కాల్స్ అన్నింటినీ కూడా టాప్ చేసిందట. ఈ క్రమంలోనే ఉక్రెయిన్ లో మహిళలు ఉంటారుగా వాళ్లని రేప్ చేయండి అంటూ ఒక సైనికుడి భార్య చెప్పింది. రేప్ చేసిన తర్వాత నీకు అక్కడ జరిగింది ఏమి చెప్పొద్దు అంతేనా అని భర్త అంటే.. అవును కాకపోతే ప్రొటెక్షన్ వాడండి అంటూ ఉక్రెయిన్ దాడి చేస్తున్న రష్యా సైనికుడు అతని భార్య తో మాట్లాడిన కాల్ రికార్డు సంచలనంగా మారిపోయింది..

మరింత సమాచారం తెలుసుకోండి: