ఉక్రెయిన్ విమానాలను ధ్వంసం చేసేందుకు.. అధునాతనమైన ఆయుధాలను అందిస్తూ ఉంది అమెరిక. అదే సమయం లో ఉక్రెయిన్ కు మద్దతు గా రష్యా పై ఆర్థిక పరమైన సాంకేతిక పరమైన యుద్ధం కూడా చేస్తుంది అమెరికా అనే విషయం తెలిసిందే. అమెరికా అండదండలతోనే ఉక్రెయిన్ సైనికులు రష్యాతో సమర్థవంతంగా పోరాటం చేయగలుగుతున్నారు. మొన్నటి వరకు ఆయుధ సరఫరాతో అండగా నిలుస్తున్న అమెరికా ఇకపై మరింత క్రియాశీలకంగా వ్యవహరించేందుకు సిద్ధమైంది అని తెలుస్తోంది.
ఇప్పటికే అధిక సంఖ్యలో ఆయుధాలు మందుగుండు సామాగ్రిని ఉక్రెయిన్ సైన్యానికి పంపడంతో పాటు వాటిని వినియోగించడం లో కూడా శిక్షణ ఇవ్వాలని అమెరికా నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. 80 కోట్ల డాలర్ల ఆయుధ ప్యాకేజీతో పాటు శిక్షణ ఇచ్చేందుకు కూడా నిర్ణయించుకుంది. ఈ ప్యాకేజీలో 18 హోవిట్జర్లు (155ఎంఎం), 40 వేల ఆర్టిల్లరీ రౌండ్లు, మానవరహిత తీరరక్షక నౌకలు, 10 ఏఎన్/టీపీక్యూ-36 ఫిరంగి నిరోధక రాడార్లు, 500 జావెలిన్ క్షిపణులు, 300 స్విచ్‌బ్లేడ్‌లు, వందల సంఖ్యలో వాహనాలు, భారీమొత్తంలో మందుగుండు సామగ్రితో పాటు 11 ఎంఐ-17 హెలికాప్టర్లనూ ఉక్రెయిన్‌కు పంపించనుంది. అంతేకాకుండా ఎంపిక చేసిన సైనికులకు వేగంగా శిక్షణ కూడా ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.