రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అటు భారత్ ఎవరికి మద్దతు ఇవ్వకుండా తటస్థ వైఖరిని వ్యవహరిస్తూ ఉండటంపై అటు అగ్రరాజ్యమైన అమెరికా ఎప్పుడూ పరోక్ష వార్నింగులు ఇస్తూనే వస్తుంది అన్న విషయం తెలిసిందే. అదే సమయంలో రష్యాతో భారత్ మరింత సంబంధాలను మెరుగుపరచుకునే నేపధ్యంలో.. క్వాడ్ కూటమిలో  భాగస్వామ్యం అయిన భారత్ వెంటనే రష్యాతో సంబంధాలను తెంచుకోవాలని అంటూ అమెరికా హెచ్చరిస్తూ ఉండడం గమనార్హం. లేదంటే భారత్ పై అమెరికా ఆంక్షలు పర్వం కొనసాగించే అవకాశం ఉంది అంటూ చెబుతోంది.  అయితే అమెరికా ఎన్ని హెచ్చరికలు జారీ చేసిన భారత్ మాత్రం తమ సొంత విదేశాంగ విధానం ద్వారానే ముందుకు నడుస్తోంది.



 తమ దేశ ప్రయోజనాల కోసం ఏ దేశం తో సంబంధం పెట్టుకోవడానికైనా సిద్ధంగా ఉన్నామంటూ భారత్ నిక్కచ్చిగా చెబుతోంది. దీంతో అమెరికా కు ఊహించని షాక్ తగులుతుంది అని చెప్పాలి. అయితే ఇటీవల కాలంలో భారత్ రష్యాల మధ్య రక్షణ బంధం మరింత బలపడుతుంది అన్న విషయం తెలిసిందే. భారత్ రష్యా నుంచి ఎన్నో అధునాతన ఆయుధాలను కొనుగోలు చేస్తూ భారత అమ్ములపొదిలో చేర్చుకొంటూ ఉండటం గమనార్హం. ఇటీవలే s400 మిసైల్స్ కూడా భారత్ అమ్ములపొదిలో కి వచ్చాయి. కాగా భారత రష్యా రక్షణ బంధం పై అమెరికా రక్షణ శాఖ పెంటగన్ ఇటీవలే తమ వైఖరిని వెల్లడించారు.


 రక్షణ అవసరాల నిమిత్తం భారత్ సహా ఏ దేశం కూడా రష్యా పై ఆధారపడ్డ వద్దు అంటూ చెప్పుకొచ్చింది. ఈ విషయంలో తమ వైఖరి స్పష్టంగా తెలియజేశామని.. ఇక దీన్ని ప్రోత్సహించ లేము అంటూ అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ వెల్లడించింది. ముఖ్యంగా భారత్ తో ఉన్న రక్షణ బంధానికి అటు అమెరికా ఎంతగానో విలువ ఇస్తుందని ఈ బంధాన్ని రానున్న రోజుల్లో మరింత ముందుకు తీసుకు వెళ్లే ఆలోచనలోనే తాము ఉన్నామని అంటూ పెంటగాన్  ప్రతినిధి తెలిపారు. ఇలా ఒక రకంగా రష్యాతో రక్షణ సంబంధాలు అన్నింటినీ కూడా భారత్ ఎంచుకోవాలి అమెరికా భారత్కు ఇన్ డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చింది అన్నది ప్రస్తుతం విశ్లేషకులు చెబుతున్న మాట..

మరింత సమాచారం తెలుసుకోండి: