ఇలాంటి సమయంలోనే ఇటీవలే ఒక సంచలన ఘటన జరిగింది. పాకిస్తాన్ నుంచి గుజరాత్ వస్తున్న ఒక బోటులో ఏకంగా రెండు వందల ఎనభై కోట్ల హెరాయిన్ పట్టుబడటం సంచలనంగా మారిపోయింది. ఇలా పాకిస్థాన్కు చెందిన పడవలో వందల కోట్ల విలువైన హేరయిన్ ఉన్న విషయాన్ని తెలిసి కచ్ తీరంలో అధికారులు పట్టుకున్నారు. అయితే ఇటీవలే ఉదయం సమయంలో భారత ప్రాదేశిక జిల్లాల లోకి అక్రమంగా ఆల్ హజ్ అనే ఒక పడవ ప్రవేశించింది. ఈ క్రమంలోనే తీర రక్షక దళం, గుజరాతి యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఇక ఈ విషయాన్ని గుర్తించింది. దీంతో లొంగిపోవాలని మొదట హెచ్చరికలు జారీ చేసింది.
ఈ క్రమంలోనే అక్కడి నుంచి పారిపోవాలని ప్రయత్నించగా పడవలో ఉన్న వారిపై కాల్పులు జరిపారు భారత అధికారులు. ఈ కాల్పుల్లో కనీసం ఇక ఇద్దరు గాయపడ్డారు అనే విషయాన్ని అధికారులు చెబుతున్నారు. ఆ తర్వాత పడవ తో పాటు 50 కిలోల బరువు ఉన్న 280 కోట్ల విలువైన హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో తొమ్మిది మందిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. అయితే ఓ ఉత్తరాది రాష్ట్రానికి ఈ నిషేధిత సరఫరా చేయాల్సి ఉందని పాకిస్తాన్లోని కరాచీకి చెందిన ముస్తఫా ఈ డ్రగ్స్ రాకెట్ వెనుక ఉండి ఉంటాడు అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన సంచలనం గా మారిపోయింది. ఇది తెలిసి పాకిస్తాన్ నుంచి భారత్కు కొత్త తలనొప్పులు మొదలయ్యాయి అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.