ఇప్పటికే సైనికులతో పాటు ఎంతో మంది సాధారణ పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉంది. ఇక ఇలాంటి నేపథ్యంలో రష్యా యొక్క ఉక్రెయిన్ పై జాలి దయ చూపించకుండా దారుణ రీతిలో దాడులకు పాల్పడుతూనే ఉంది. అయితే అటు అమెరికా సహా నాటో యూరోపియన్ యూనియన్ దేశాలు రష్యాపై ఆంక్షల పర్వం కొనసాగిస్తున్నప్పటికీ రష్యా తీరులో మాత్రం ఎక్కడా మార్పు రావడం లేదు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక ఉక్రెయిన్ లో నెలకొన్న అల్లకల్లోల పరిస్థితుల పై ఏకంగా ప్రస్తుతం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ప్రపంచ దేశాలు.
ఇలాంటి సమయంలోనే ఉక్రెయిన్ లో జరుగుతున్న యుద్ధంలో ఎలాగైనా విజయం సాధించాలనే లక్ష్యంతో రష్యా మరో సరికొత్త వ్యూహానికి తెరలేపింది అని తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఇటీవల డాల్ఫిన్ ఆర్మీ ని రంగంలోకి దించడానికి రష్యా సిద్ధమైంది అని తెలుస్తుంది. దీని కోసం డాల్ఫిన్ లకు ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చి యుద్ధ రంగంలోకి దించపోతున్నారట. నల్ల సముద్రం లోని రష్యా రక్షణ కోసం వీటిని మోహరించి నట్లు తెలుస్తోంది. నీటి అడుగున జరిగే దాడులను ముందుగానే పసిగట్టేందుకు ఇక ఈ డాల్ఫిన్ ఆర్మీని రష్యా సిద్ధం చేసింది అన్నది తెలుస్తుంది..