అయితే ఒకప్పుడు కేవలం సినీ సెలబ్రిటీలు మాత్రమే ఇలా తమ అందానికి మరింత మెరుగులు దిద్దేందుకు లక్షలు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ చివరికి ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకునే వారు. కానీ ఇటీవలి కాలంలో మాత్రం కొంత మంది నెటిజన్లు కూడా అందంగా కనిపించడానికి ఫేమస్ అవ్వడానికి ప్లాస్టిక్ సర్జరీల ను ఆశ్రయిస్తున్నారు అన్న విషయం తెలిసిందే. కానీ కొంతమంది ప్లాస్టిక్ సర్జరీలు వికటించి అందవిహీనంగా మారిపోతున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే.
అయితే ఇక్కడ ఒక అమ్మాయి మాత్రం ఏకంగా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని తనను తాను ఒక కార్టూన్ బొమ్మలా మార్చుకుంది. ఈ ఘటన స్వీడన్లో వెలుగులోకి వచ్చింది. స్వీడన్ చెందిన పేక్సీ ఫాక్స్ అనే యువతికి కార్టూన్ లో కనిపించే అమ్మాయిల సన్నటి నడుము కావాలని కోరిక. ఇలా ఉంటే నటిగా అవకాశాలు వస్తాయని ఆమె గట్టిగా నమ్మేది. దీనీ కోసం ఏకంగా 77 లక్షల రూపాయలు ఖర్చు చేసి వెన్నెముకకు రెండువైపులా ఉండే ఆరు ఎముకలను ప్లాస్టిక్ సర్జరీ ద్వారా తొలగించుకుంది. ప్రస్తుతం ఆ అమ్మాయి నడుము 14 అంగుళాలకు చేరింది. ఇక అంతే కాదు తనని తాను లివింగ్ కార్టూన్ అంటూ చెప్పుకుంటుంది సదరు యువతి. కనురెప్పలు ముక్కు వక్షోజాలకు కూడా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని నిజంగానే బొమ్మల మారిపోయింది..