ఇటీవలి కాలంలో భారత్ అటు దౌత్య పరమైన సంబంధాలను మెరుగు పరచుకునే తీరు ప్రపంచ దేశాలను ఆకర్షిస్తుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమం లోనే ఇన్నాళ్ళ వరకు అమెరికా ని నమ్ముకొని ముందుకు సాగిన అన్ని దేశాలు ఇక ఇప్పుడు భారత్తో సంబంధాలను మెరుగు పరుచుకునేందుకు సిద్ధమవుతున్నాయి. భారత విధి విధానాలకు ఎక్కువగా ఆకర్షితులు అవుతున్నాయి అనే చెప్పాలి. ఈ క్రమం లోనే  మొన్నటివరకు అగ్రరాజ్యమైన అమెరికా పైన ఎక్కువగా ఆధారపడిన జపాన్ ఇప్పుడు తమ విధానాన్ని మార్చుకుంటుంది అన్నది అర్ధమవుతుంది.


 ఏకంగా ఆయుధ రంగంలో అంతకంతకు వృద్ధి సాధిస్తున్న భారత్తో సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు జపాన్ సిద్ధమవుతూ ఉండడం గమనార్హం. ఇన్నాళ్ల పాటు అమెరికా మీద ఆధారపడిన జపాన్ ఇక అమెరికా నమ్ముకుంటే ఉక్రెయిన్ పరిస్థితి వస్తుందని భావించి  ఇప్పుడు భారత్ తో కలిసి ముందుకు వెళ్లేందుకు  సిద్ధమైంది. అయితే జపాన్ ఎలక్ట్రిక్ ఎక్విప్ మెంట్  తయారీ రంగంలో ఎప్పుడూ అగ్రగామి గానే కొనసాగుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే భారత్ మరో పన్నెండు దేశాలతో రక్షణ పరమైన సంబంధాలు పెట్టుకునేందుకు సిద్ధమైంది అన్నది తెలుస్తుంది.


  ఈ క్రమంలోనే ఎలక్ట్రోమాగ్నెటిక్ రైఫిల్ గన్, అధునాతన టెక్నాలజీతో కూడిన ఫైటర్ జట్లు, మిస్సైల్ లను  భారత సహా మరో 12 దేశాలకు అమ్మేందుకు జపాన్ సిద్ధమవడం గమనార్హం. ఇక ఇలా జపాన్ భారత్ కు ఇవ్వబోతున్న ఆయుధాలు సైనికులు తమ స్థావరాల నుంచే ఆయుధాలను కంట్రోల్ చేసేందుకు అవకాశం ఉంటుందట. ఇక ఈ ఆయుధాల రాకతో భారత ఆర్మీ కూడా మరింత పటిష్టవంతంగా మారిపోతుంది అన్నది ప్రస్తుతం విశ్లేషకులు చెబుతున్న మాట. అయితే సరిహద్దులో చైనా జపాన్ కు చెందిన దీవులను స్వాధీనం చేసుకునేందుకు చైనా ప్రయత్నిస్తూ ఉద్రిక్త పరిస్థితులు సృష్టిస్తున్న నేపథ్యంలోనే జపాన్ ఇలాంటి సంబంధాలను మెరుగుపరుచుకుందని విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: