ఇలా ఎంతో మంది తిరుగుబాటు దార్లు పార్లమెంటు పై దాడి చేసేందుకు రావడం.. జో బైడెన్ ను అడ్డుకొని ఇబ్బందులు సృష్టించడం వెనుక మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఉన్నాడు అంటూ అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. అయితే దీనిని అధికారికం గా ధ్రువీకరించలేదు బైడెన్ ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన కమిటీని నియమించింది అన్న విషయం తెలిసిందే. అయితే ఇన్నాళ్ళ వరకు ఈ విషయం పై విచారణ జరిపిన కమిటీ అమెరికా పార్లమెంటు భవనం పై దాడికి ట్రంపు కారణం అంటూ తేల్చింది.
ట్రంప్ ప్రేరేపిత శక్తులే ఇలాంటి ఇబ్బందులకు గురి చేశాయని కాంగ్రెస్ విచారణ కమిటీ నివేదించింది. 2021లో పార్లమెంట్ భవనం పై జరిగిన జరిగిన దాడి ఆకస్మికం గా జరిగినా దాడి కాదని ఉద్దేశపూర్వకం గానే జరిగింది అనే విషయాన్ని తేల్చారు. ఎన్నికల్లో ఓటమి పాలైనా ట్రంప్ అల్లరి మూకల తో ఇలా ఇబ్బందులకు గురి చేసినట్లు తెలిపింది. ఎన్నికల్లో పెద్ద ఎత్తున మోసం జరిగిందని పదే పదే ఆరోపించడం వల్ల ఇలా ఎంతోమందినీ రెచ్చగొట్టి ఇలా పార్లమెంట్ భవనం పై దాడికి ఉసిగొల్పారట . కమిటీ ఇచ్చిన నివేదిక కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారి పోయింది. తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి అన్నది మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారి పోయింది