ప్రస్తుతం ఉక్రెయిన్ రష్యా యుద్ధం నేపథ్యంలో అక్కడ అల్లకల్లోల పరిస్థితులు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఉక్రెయిన్లో నగరాలపై రష్యా తీవ్ర రూపం లో దాడులకు పాల్పడుతూన్న నేపథ్యంలో మారణహోమం జరుగుతోంది. యుద్ధం మొదలై వంద రోజులు గడుస్తున్న పరిస్థితుల్లో మాత్రం ఎక్కడా మార్పు రావడం లేదు. ఒకవైపు రష్యాకు లొంగిపోయే ప్రసక్తి లేదు అంటూ ఉక్రెయిన్ చెబుతూ ఉండటం.. మరోవైపు ఇక తను అనుకున్న లక్ష్యాలను సాధించే వరకూ తమ సైనిక చర్య ఆపే ప్రసక్తి లేదు అంటూ రష్యా స్టేట్మెంట్ ఇస్తూ ఉండడం తో పరిస్థితుల్లో మాత్రం మార్పు కనిపించడం లేదు.



 ఇరు దేశాలకు చెందిన అధ్యక్షులు మధ్య ఉన్న వైరం కాస్త ఏంతో మంది సామాన్య ప్రజల పాలిట శాపంగా మారిపోతుంది. ఈ క్రమంలోనే అమాయక ప్రజలు చివరికి ప్రాణాలు కోల్పోతున్న స్థితి ఏర్పడుతుంది. అయితే ఉక్రెయిన్ లో ఎంతో అల్లకల్లోల పరిస్థితులు ఉన్నాయి అన్న విషయాన్ని తెలిపేందుకు ఇక అక్కడ ఎక్కడ చూసినా కుప్పలుతెప్పలుగ కనిపిస్తూ మృతదేహాల ఉదాహరణ అని చెప్పాలి. ఇలా రోడ్లపై మృతదేహాలు పడి ఉంటే కనీసం ఆ మృతదేహాలను తొలగించేవారు కూడా అక్కడ కరువయ్యారు.



 ఇలాంటి నేపథ్యంలో ఉక్రెయిన్ లోని ప్రధాన నగరాల్లో ఒకటైన మెరుయుపోల్ వీధులు స్మశాన ప్రాంతాలుగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే మృతదేహాలను తొలగించకపోవడంతో అవి కుళ్లిపోయి కలరా ప్రబలుతూ ఉండటం గమనార్హం. దీంతో వందలాది మంది ప్రజలు కలరా బారిన పడుతూ ఉన్నారు. ఇక ఉక్రెయిన్లోని మరి కొన్ని నగరాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది అని తెలుస్తోంది. ఉక్రెయిన్ లోని ప్రధాన నగరాల్లో ఒకటైన మరియుపోల్ ప్రస్తుతం రష్యా ఆధీనంలో ఉండటం గమనార్హం. ఇలా ఇప్పటికే ఎప్పుడు ప్రాణాలు పోతాయని అక్కడ ప్రజలు భయపడుతూ ఉంటే ఇక ఇప్పుడు కలరా ప్రాణాలు తీస్తూ ఉండటంతో మరింత భయాందోళనలో మునిగిపోతున్నారు అక్కడి ప్రజలు..

మరింత సమాచారం తెలుసుకోండి: