
ఇలాంటి సమయంలో ఇటీవలే చైనా అటు ఇండియన్స్ కి గుడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. చైనా లో పనిచేస్తూ స్వదేశంలో ఉండిపోయిన భారతీయులు వారి కుటుంబీకులు కూడా ఎన్నో రోజుల నుంచి చైనా నుంచి వీసా మంజూరు కోసం ఎదురుచూస్తూ ఉన్నారూ అన్న విషయం తెలిసిందే. ఇక ఈ విషయంలో ఎట్టకేలకు బీజింగ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కరోనా కారణంగా చైనా లో పనిచేస్తూ భారత్ లోనే ఉండి పోయిన వారికి వీసా లను పునరుద్ధరించే ప్రణాళికలను ప్రకటించింది ప్రభుత్వం. చైనాలోని అన్ని రంగాల్లో పనిచేసే వారు వారి కుటుంబ సభ్యులు తిరిగి చైనాకు వెళ్లాలనుకునే వారు వీసా దరఖాస్తు చేసుకుంటే వెంటనే ఆమోదం తెలుపుతాము అంటూ తెలిపింది.
ఈ విషయాన్ని భారత్ లోని చైనా రాయబార కార్యాలయం వెల్లడించడం గమనార్హం. అయితే తాజా నిర్ణయంతో గత రెండేళ్లుగా భారత్లో ఉండిపోయిన వందలాది భారతీయ కుటుంబాలకు ఊరట లభించినట్లయింది అని చెప్పాలి. అయితే ఇలా చైనా లో పనిచేస్తూ భారత్ లో ఉండిపోయిన ఉద్యోగుల విషయంలోనే కాదు చైనాలోని విశ్వవిద్యాలయంలో చదువుకునే వేలాది మంది భారత విద్యార్థుల అభ్యర్థులను కూడా అక్కడి ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది అని తెలుస్తోంది. కాగా 2020లో చైనాలో ఉన్న భారతీయ ఉద్యోగులు విద్యార్థులను కూడా భారత్కు పంపింది. రెండు ఏళ్ళు గడుస్తున్న వీసా మంజూరు పై స్పష్టత ఇవ్వలేదు. కానీ ఇటీవల గుడ్ న్యూస్ చెప్పింది చైనా.