ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. రష్యా యుద్ధం మొదలు పెట్టి వంద రోజులు గడిచిపోతున్నాయి. ఇంకా పరిస్థితుల్లో మాత్రం మార్పు రావడంలేదు. అదే రీతిలో ఉక్రెయిన్ పై భీకరమైన దాడులు చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే అందరి దృష్టికి కూడా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పైనే పడింది.  ప్రస్తుతం ఉక్రెయిన్ తో జరుగుతున్న యుద్ధం పై పుతిన్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు.. తర్వాత స్టెప్ ఏమిటి.. ఇక ప్రస్తుతం పుతిన్  ఏం చేస్తున్నారు అని అందరూ ప్రత్యేక నిఘా పెట్టారు అని చెప్పాలి.


 అయితే ఉక్రెయిన్ రష్యా యుద్ధం నేపథ్యంలో అటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోగ్యంపై కూడా రకరకాల ఊహాగానాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయాయ్. ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు ఇంకా ఎక్కువ రోజులు ఉండలేరు అంటూ ఎన్నో వార్తలు అంతర్జాతీయ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయాయి. ఇక ఇప్పుడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు సంబంధించిన ఒక వీడియో ట్విట్టర్ వేదికగా తెగ చక్కెర్లు కొడుతుంది. ఇక ఈ వీడియోలో చూసుకుంటే పుతిన్ కనీసం నిలబడటానికి కూడా ఎంతగానో ఇబ్బంది పడిపోతున్నారు.



 ఆయన కాళ్ల దగ్గర నుంచి తల వరకు బాడీ మొత్తం వణికి పోతూనే ఉంది అన్నది మాత్రం ఈ వీడియోలో చూస్తే అర్థమవుతుంది. ఇక పుతిన్  ప్రసంగం ఇచ్చే సమయంలో కూడా ఆయన గొంతు గంభీరంగా వస్తున్నప్పటికీ ఆయన కాళ్లు మాత్రం వణుకుతూ ఒకచోట నిలబడలేక పోతున్నాయ్ అన్నది గమనించవచ్చు. ఈ వీడియో చూసిన తర్వాత పుతిన్ ఆరోగ్యం మరింత క్షీణించింది అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే పుతిన్ తీవ్ర అనారోగ్యంతో ఉన్నారని రక్త క్యాన్సర్ తో ఆరోగ్యం రోజురోజుకు దెబ్బతింటుందని వస్తున్న వార్తలు నిజమే అని ఈ వీడియో చూసిన తర్వాత ఎంతోమంది నమ్ముతూ ఉన్నారు. ఇటీవలే క్రెమ్లిన్ లో జరిగిన అవార్డుల ప్రధానోత్సవం లో పాల్గొన్న పుతిన్ ఇలా నిలబడ లేక ఇబ్బంది పడటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: