ఇలా ప్రపంచం మొత్తం బాల్య వివాహ కు దూరం గా వెళ్ళి పోతూ ఉంటే కొన్ని దేశాల్లో మాత్రం బాల్య వివాహాల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది అని తెలుస్తుంది. ఏకంగా అమ్మాయిలను అంగట్లో ఆట బొమ్మగా మార్చి అమ్మేస్తున్నారు అన్న విషయం ఇటీవల తెర మీదికి వచ్చి సంచలనం గా మారి పోయింది. ఇక ఇలాంటి ఘటనలు అటు దక్షిణ సూడాన్లో జరుగుతూ ఉంది. ఏకంగా బాల్య వివాహాల పేరిట అక్కడ అందమైన అమ్మాయిలను చిన్నారులను బలవంతం గా బహిరంగం గా అమ్మేస్తున్నారు అన్న విషయం తెలుస్తోంది.
అయితే ఒక అమ్మాయిని అమ్మేసినందుకుగాను ప్రతిఫలం గా డబ్బు ఇవ్వడం కాకుండా 100 లేదా రెండు వందల ఆవులను అమ్మాయిలు తల్లిదండ్రులకు ఇస్తున్నారట. ఒక అమ్మాయి కాస్త అందంగా ఉంటే ఉన్నత సామాజిక వర్గానికి చెందినది అయితే ప్రతి ఫలంగా ఇచ్చే ఆవుల సంఖ్య మరింత పెరుగుతుందట. ఇకపోతే ఇటీవలే ఒక ఉన్నత స్థాయి కుటుంబానికి చెందిన అందమైన అమ్మాయి 500 ఆవులకు అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే దక్షిణ సూడన్ లో ఎంతో మంది నిరుపేదలు ఇక ఇలాంటివి చేస్తూ ఉంటే చాలామంది ఇలాంటి పద్ధతిని వ్యతిరేకిస్తున్నారు అని చెప్పాలి.