తక్కువ సమయంలో కోటీశ్వరుడు కావాలని కల ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ కొంతమందికి మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ఓవర్ నైట్ లో కోటీశ్వరుడు కావాలంటే ఉన్నది ఒకే ఒక మార్గం. అదే లాటరీ. అదృష్టం తలుపుతట్టింది అంటే లాటరీ ద్వారా గెలుచుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇప్పటికే ఎంతోమంది విషయంలో కూడా ఇది నిజం అయింది అన్న విషయం తెలిసిందే. అలా అని అందరికీ లాటరీ వరిస్తుంది అన్నది మాత్రం పక్కా చెప్పలేము. ఇంతకీ ఇప్పుడు లాటరీ గురించి ఎందుకు మాట్లాడు కోవాల్సి వచ్చింది అంటే.. ఇక్కడ అమెరికాకు చెందిన ఒక వ్యక్తి నిద్రలో వచ్చిన కల అదృష్టాన్ని తెచ్చి పెట్టింది.


 అతనికి నిద్రలో వచ్చిన కల చివరికి అతని కోటీశ్వరుడు చేసింది. కోల్ మాన్ అనే వ్యక్తికి  నిద్ర లో వచ్చిన కలల్లో కొన్ని నెంబర్స్ కనిపించాయ్. అయితే ఉదయం లేచిన వెంటనే తన హోమ్ టౌన్ లో ఉన్న ఇక అదే సిరీస్ బ్యాంక్ ఏ మిలియన్ లాటరీ కొన్నాడు. ఇంకేముంది ఊహించని విధంగా అతనికి లాటరీ పలికింది. దీంతో కేవలం రెండు డాలర్లు పెట్టి టిక్కెట్ కొనుగోలు చేస్తే 2 లక్షల 50 వేల డాలర్లు జాక్పాట్ కొట్టేసాడు.  ఇక ఇలా లాటరీ గెలుచుకున్న తర్వాత మీ ఫీలింగ్ ఏంటి అంటూ అడుగగా తనకు కలలో కనిపించిన నెంబర్ కొనుగోలు చేశానని దానికి ప్రైజ్మనీ వచ్చిందని చెప్పడంతో అందరూ అవాక్కయ్యారు.


 13 నుంచి 18 వరకు నెంబర్ సిరీస్ ఉండేలా కోల్ మాన్ అనే వ్యక్తి లాటరీ కొన్నాడు. జూన్ 11వ తేదీన డ్రా తీసినప్పుడు ఆ నెంబర్లకే లాటరీ తగిలింది. విన్నర్ ఎవరు అన్నది ఆ తర్వాత కొన్ని రోజులకి అధికారులు ప్రకటించారు. అయితే బోనస్ బాల్ నెంబర్ 19 మిస్ అయ్యాడు సదరు వ్యక్తి. ఒకవేళ ఆ నెంబర్ కూడా తగిలి ఉంటే ఇంకా ఎక్కువ డబ్బు వచ్చేదట. ఏదేమైనా అతనికి భారీగా డబ్బులు రావడంతో అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అని చెప్పాలి. ఇక ఈ విషయాన్ని తాను అసలు నమ్మలేకపోతున్నాను అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: