ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. ఒక చిన్న దోమ కారణంగా చివరికి ఒక పైలట్ మృతి చెందింది. ఈ ఘటన కాస్త దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిపోయింది. బ్రిటన్లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే ఏడాది కిందట ఆ యువతి మృతి చెందింది. కానీ ఇటీవల యువతి మృతికి గల కారణాలు ఏంటి అన్నది నివేదిక బయటికి వచ్చి సంచలనం గా మారిపోయింది. బ్రిటన్కు చెందిన ట్రైని పైలెట్ ఒరివియా పెప్పర్ దోమకాటు కారణంగా కంటి పై చిన్న వాపు కనిపించింది. మొదట్లో కుటుంబ సభ్యులతో పాటు సదరు యువతి కూడా ఆ వాపును లైట్ తీసుకుంది. కానీ క్రమక్రమంగా వాపు పెరిగిపోతూ రావడంతో వెంటనే ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు కుటుంబ సభ్యులు.
ఈ క్రమంలోనే దోమకాటు కారణంగా వాపు వచ్చింది అని చెప్పడంతో అటు వైద్యులు కూడా లైట్ తీసుకున్నారు. యాంటీబయోటిక్స్ టీకాలు ఇచ్చి అందరినీ ఇంటికి పంపించారు. తర్వాత ఒక్కసారిగా స్పృహ తప్పి కింద పడిపోయింది యువతి. ఆమె కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా చికిత్స తీసుకునే క్రమంలో ఆమె ఆరోగ్యం మరింత విషమించింది.. చివరికి ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఈమె మృతి మిస్టరీగా మారిపోయింది. దీంతో ఇక ఈమె మృతి పై అధ్యయనం జరగ్గా దోమకాటు కారణంగానే శరీరంలో కలిగిన ఇన్ఫెక్షన్ మెదడుకు చేరడంతో చివరికి సదరు యువతి మృతి చెందిందని ఇటీవల విడుదలైన నివేదిక చెబుతోంది. కొద్ది ఇది మందికే జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు.