
సాధారణంగా పాములు, తేల్లు లాంటివి మనిషికి చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఇవి కుట్టాయి అంటే చాలు మనిషి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఇక పాములు తేళ్ల కు సంబంధించిన విషం మనిషి శరీరం లోకి వెళ్తే ఎంతో ప్రమాదకరం. కాని ఇక వీటి విషం తో మనిషికీ ఉపయోగపడే విధంగా ఎన్నో తయారు చేయవచ్చు అన్నది కొన్ని కొన్ని సార్లు బయటపడుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే సర్పాలు కీటకాలు గా పేరున్న తేలు విషం కోట్లలోనే పలుకుతుంది అన్నది తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి వార్త ఒకటి వైరల్ గా మారిపోయింది.
ఏకంగా లీటరు తేలు విషయం 80 కోట్ల రూపాయలు పలుకుతుందట. ఇది ఎంత చెప్పినా నమ్మాలి అనిపించేలా లేదు కదా. కానీ ఇది నిజమే టర్కీకి చెందిన మెటీన్ ఒరిన్లెర్ అనే వ్యక్తి తేల్ల ఫామ్హౌస్ నిర్వహిస్తున్నాడు. ఇక వాటిలో వేల సంఖ్యలో తేళ్లను పెంచుతూ.. ఇక వాటి విషాన్ని స్వీకరిస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఆ విషాన్ని గడ్డకట్టేలా చేసి తరువాత పొడిగా మార్చి విక్రయిస్తాడు. అయితే లీటర్ విషం ధర 80 కోట్ల పైమాటే నట. ఇక ఇలా తీసిన తేలు విషాన్ని యాంటీబయోటిక్స్, కాస్మోటిక్స్, పెయిన్ కిల్లర్ ల తయారీలో ఉపయోగిస్తారు. అయితే 300 నుంచి 400 తేల్ల నుంచి ఒక గ్రాము విషాన్ని సేకరిస్తారట. నిజంగా ఈ విషయం కాస్త ఆశ్చర్యం గానే ఉంది కదా.