మాతృత్వం అనేది ప్రతి మహిళకు ఒక వరం లాంటిది అన్న విషయం తెలిసిందే. తొమ్మిది నెలల పాటు ఎంతో ఇష్టంగా గర్భాన్ని మోసి భారం అనుకోకుండా నరకం లాంటి నొప్పులను కూడా నవ్వుతూ భరిస్తుంది ప్రతి మహిళ. ఒకప్పుడు మహిళకు ఏ చిన్న ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా గర్భం దాల్చే వారు కాదు. ఇక అటు వైద్యుల దగ్గర కూడా చికిత్స ఉండేది కాదు.. కానీ ఇప్పుడు అధునాతన టెక్నాలజీని అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ఎంతోమంది కృతిమ పద్ధతిలో గర్భందాల్చుతు ఉండడం గమనార్హం. అంతే కాకుండా సరోగసీ ప్రక్రియ కూడా ప్రస్తుతం అందుబాటులో ఉంది అన్న విషయం తెలిసిందే.


 అయితే కృత్రిమ గర్భధారణ అనేది ఇన్ వివో ఫలదీకరణం ద్వారా జరుగుతూ ఉంటుంది. స్త్రీ గర్భాశయం కుహరంలోకి విర్యానీ ఇంజెక్ట్ చేయడంతో ఈ ప్రక్రియ ప్రారంభం అవుతుందట. అయితే దీనిని కేవలం అనుభవజ్ఞులైన వైద్యులు మాత్రమే చేస్తారట. అంతేకాదు ఇక ఈ చికిత్సకు కూడా కాస్త ఖర్చు కూడా  ఎక్కువగానే ఉంటుంది అని తెలుస్తుంది. ఇకపోతే ఇటీవలే ఒక మహిళ కేవలం నాలుగు వేల రూపాయల కంటే తక్కువ ధర తో డిఐవై కిట్టు తో ఇంట్లోనే కాన్పు చేసుకుంది. అమెరికాకు చెందిన బెయిలీ ఎన్నిస్ అనే మహిళ తల్లి కావాలి అని భావించి ఆమెకు ఇంకా పెళ్లి కాకపోవడం గమనార్హం.


 అయితే తనకు ఒక మగతోడు కావాలన్న ఆసక్తి లేదు.  కానీ తల్లి కావాలని ఆశ మాత్రం ఆమె లో పుట్టింది.  దీని కోసం ఆమె డీ ఐ వై పద్ధతిని ఎంచుకుంది.  ఈ క్రమంలోనే ఎటువంటి వృత్తిపరమైన సహాయం లేకుండా గర్భధారణ పొందడం గమనార్హం. తొమ్మిది నెలల పాటు బిడ్డను మోసి ఇటీవల 2.32 కిలోల బరువు ఉన్న ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనిచ్చింది.  అయితే ఈ ప్రక్రియ ద్వారా మొదటి ప్రయత్నంలోనే గర్భం ధరించడం అనేది దాదాపు అసాధ్యం అంటున్నారు వైద్య నిపుణులు. కానీ ఒకవేళ అలా జరిగింది అంటే మాత్రం అదృష్టవంతులు అని చెబుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

Nri